India US Trade Deal : అమెరికా భారత్ ఇచ్చిన ప్రతిపాదనపై పూర్తిగా సంతృప్తిగా ఉంటే, వెంటనే వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. గురువారం ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన, అమెరికా నుంచి వచ్చిన సానుకూల స్పందనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కానీ, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ ఇండియా–US స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఏదైనా సమయ పరిమితిని మాత్రం వెల్లడించలేదు.
ఈ వ్యాఖ్యలు, అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్ చేసిన వ్యాఖ్యల తర్వాత వచ్చాయి. ఆయన ప్రకారం, భారత్ నుంచి అమెరికాకు ఇప్పటివరకు వచ్చిన వాటిలోనే “అత్యుత్తమమైన ఆఫర్” ఇదేనని తెలిపారు. దీనిపై స్పందించిన గోయల్, “వాళ్లు సంతోషంగా ఉన్నట్లైతే, ఒప్పందంపై వెంటనే సంతకం చేయాలి” అని అన్నారు. అయితే భారతదేశం అమెరికాకు ఏం ఆఫర్ ఇచ్చిందన్న వివరాలను చెప్పడానికి ఆయన నిరాకరించారు.
Latest News: Indigo Auto-Rickshaw: ఇండిగో ఎయిర్‌లైన్స్ Vs ఇండిగో ఆటో: హర్ష్ గోయెంకా ఫన్నీ పోస్ట్
ఇప్పటికే రెండు దేశాల మధ్య అయిదు రౌండ్ల చర్చలు జరిగాయి. ప్రస్తుతం భారత్ పర్యటిస్తున్న అమెరికా డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్ విజిట్ చర్చల (India US Trade Deal) కోసం కాదని, పరస్పర అవగాహన పెంపు కోసం మాత్రమేనని గోయల్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో స్విట్జర్ నేతృత్వంలోని బృందం మరియు వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ టీమ్ మధ్య చర్చలు ముగిశాయి. రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ, ఎనర్జీ వంటి కీలక రంగాల్లో సహకారం పెంపుపై కూడా చర్చించాయి.
ప్రధాన మంత్రి నరేందర్ మోదీ మరియు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం ఫోన్లో మాట్లాడి ఆర్థిక, వ్యాపార సహకారాన్ని మరింతగా బలోపేతం చేయాలని అంగీకరించారు.
చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నరేష్ నగేశ్వరన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, వచ్చే మార్చిలో ఒప్పందం సంతకం అవుతుందని తనకు సమాచారం లేదని గోయల్ తెలిపారు. ఇద్దరు దేశాలకు ప్రయోజనకరమైనదే ఒప్పందమని, ఖచ్చితమైన టైమ్‌లైన్ పెట్టి మిస్టేక్ చేయకూడదని పేర్కొన్నారు.
అమెరికా వైపు నుండి వచ్చిన తాజా వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యతగలవే. ఇండియా కొన్ని వ్యవసాయ పంటలు, మాంస ఉత్పత్తుల విషయంలో ఆంక్షలు పెట్టడం వల్ల ఇరుపక్షాల్లో చర్చలు క్లిష్టమయ్యాయని అమెరికా తెలిపింది. అయితే భారత్ నుంచి వచ్చిన తాజా ఆఫర్లు గతంలో ఎప్పుడూ లేనంత బలంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
అమెరికా 50% వరకు భారీ దిగుమతి సుంకాలు విధించడం వల్ల భారత ఎగుమతులపై ఒత్తిడి పెరిగింది. డాలర్‌కి పైగా రూపాయి విలువ పడిపోయిన సమయంలో ఈ చర్చలు కీలకం కావడంతో ఇండియన్ ఇండస్ట్రీలు ఒప్పందం త్వరగా పూర్తవుతుందనే ఆశతో ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా భారత ఎగుమతులలో సుమారు 18% మార్కెట్‌ను కలిగి ఉంది.
మొదట 25% సుంకం వాణిజ్య లోటు కారణంగా విధించగా, రష్యన్ క్రూడ్ కొనుగోలు చేసినందుకు భారతపై మరో 25% అదనపు పన్ను విధించిన విషయం తెలిసిందే. ఈ సుంకాల పరిష్కారమే ట్రేడ్ డీల్ ఫస్ట్ ఫేజ్‌కు కీలకమని భారత్ స్పష్టం చేసింది. అమెరికా అగ్రి ఉత్పత్తులపై టారిఫ్ రాయితీలు కోరుతుండగా, భారత ప్రభుత్వం రైతులు మరియు MSMEలను కాపాడటంలో రాజీ పడబోదంటోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :