హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల ధైర్యం పెరిగిపోతోంది. మేడ్చల్ కీసర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా నటించిన ఓ కేటుగాడు, ట్రూకాలర్‌లో ‘CI’గా పేరు మార్చుకుని, వాట్సప్‌లో పోలీస్ యూనిఫార్మ్ డీపీ పెట్టి బోగారం ప్రాంతంలోని పెట్రోల్ బంక్ మేనేజర్ హనుమంతును నమ్మబలికాడు. ‘‘ఇన్‌స్పెక్టర్‌కు అత్యవసరంగా ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపాలి’’ అని చెప్పి QR కోడ్ పంపి 20,000 రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. డబ్బులు పంపిన తర్వాత ఎవరూ రాకపోవడంతో హనుమంతుకు అనుమానం వచ్చి చివరకు కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Read also: Hyderabad Aquarium: రూ. 300 కోట్లతో భారీ టన్నెల్ అక్వేరియం

Hyderabad Crime
వాట్సప్ డీపీలు, ట్రూకాలర్ ఐడీలు మార్చుకుని
కేసు నమోదు చేసిన పోలీసులు, డబ్బులు వెళ్లిన ఖాతా ఆధారంగా నిందితుడి కోసం దర్యాప్తు వేగవంతం చేశారు. ఇటీవల అధికారుల పేర్లు, వాట్సప్ డీపీలు, ట్రూకాలర్ ఐడీలు మార్చుకుని మోసాలు చేసే ఘటనలు పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి అధికారీ ఫోన్ ద్వారా డబ్బులు అడగరని స్పష్టం చేస్తూ, అనుమానాస్పద కాల్ వస్తే నేరుగా పోలీస్ స్టేషన్‌లో ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు. మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేస్తే డబ్బులు రికవరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: