కార్తిక మాసం.. ప్రత్యూషవేళ.. ఉదయాన్నే ఆరు గంటలకి నేను పొలానికి బయలుదేరాను. మా ఇంటికి మా పొలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దారంతా హరితపు వర్ణపు వరి చేలు.. దీపావళి వెళ్లిపోయింది కాబట్టి కొన్ని చేలు పసుపు వర్ణంలోకి మారుతూ కంటికింపుగా కనిపిస్తున్నాయి. తూరు సంధ్య అప్పుడే సింధూరంలోకి మారుతోంది. ఆకాశంలో మల్లెదండల్లా పక్షుల గుంపులు.. దూరంగా ఏటి ఒడ్డున తోటల్లోంచి కోకిల కలకూజితాలు. ఒక పొలం నుండి ఇంకొక పొలంలోకి గలగలమని శబ్దం చేస్తూ పారుతున్న నీరు.. వరికంకుల మీద తెల్లటి నీహారికా బిందువులు.. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది.. అందుకే నేను ఈ సమయంలో పొలానికి వెళ్తుంటాను. చదివింది ఏజీ బీయస్సీ అయినా ఉద్యోగానికి వెళ్లకుండా వ్యవసాయంలోకి దిగడంతో నాన్నకి నా మీద కోపం. “లేక లేక పుట్టినవాడు మనతో ఉంటానంటే సంతోషించక కోపం ఎందుకని” నాన్నతో చెబుతుంటుంది అమ్మ. ఎంతైనా అమ్మ కదా. జీవితంలో నేనెక్కడవెనకపడిపోతానేమోనని నాన్న భయం. కొద్దిసేపటికి పొలం చేరుకున్నాను. అప్పటికే మా రైతు సీతన్న అక్కడ పొలానికి నీళ్లు పెడుతూ కనిపించాడు. వాడు వ్యవసాయ పనుల్లో నాకు సహాయం చేస్తుంటాడు.

అతనికిక్కడ ఓ ఐదెకరాల పొలం ఉంది. తండ్రీ, కొడుకు రావుడూ రోజూ చాలా కష్టపడుతుంటారు. ఏరు మా ఊరు పక్క నుంచి పారుతున్నా ఊరు ఎత్తులో ఉండటం వల్ల మా పొలాలకు ఏటి వల్ల ఏ ఉపయోగం లేదు. అందుకని నేను మా పొలంలో రెండు ట్యూబ్వెల్స్ తవ్వించి పైపులు అన్ని మళ్లకూ పెట్టించాను. కాబట్టి నీటి సమస్య లేదు. మా పొలాలకు ఎగువ పెద్ద చెరువు ఉంది. దాని నీళ్లే మా రైతులు వాడుతుంటారు. సీతన్న
పొలానికి అప్పుడప్పుడు ఆఖరి తడికి నీళ్లు చాలకపోతే మా బోరు నుంచి నీరిస్తుంటాను. మాకున్న ఇరవై ఎకరాల్లో ఓ ఐదెకరాల్లో పట్టుకొని పాలం మధ్య బట్టిలో నేన్నో వెతుకుతున్నాడు. “ఏంటి సీతన్నా! ఏమైంది?” పెద్ద పాము బాబూ… నాగుపాములో ఉంది. నా కాళ్ల మధ్య నుంచి ఎల్లిపోనాది. కన్ను “ఏమారితే నన్ను “పొడిచేసి ఉండేది” అన్నాడు. కర్రతో గడ్డిని కొడుతూ! అందుకే బూట్లు వేసుకోమంటాను. టార్చిలైట్ లేకుండా అంత చీకట్లో ఎందుకు రావటం చెప్పు. పొలంలో పాము నుంచి రెండోసారి. తప్పించుకున్నావు కదూ” అన్నాను. “రెండోపాలి కాదు ఇది మూడోపాలి. అయినా బాబూ సిన్నప్పట్నుంచీ ఈ పొలానికి ఒత్తున్నాను. ఎన్నో మార్లు పాములు కనిపిత్తుంటాయి.
అవేటి సేత్తాయి.. కానీ నా భయమంతా మావోడి గురించే, ఆడు దుడుకు మనిషి: జాగరత్త గుండాలని ఆడికి సెప్పాలి” అన్నాడు సీతన్న. నా చిన్నప్పట్నుంచీ చూస్తూనే ఉన్నాను. మా పొలాల్లో ఎన్నో పాములు.. ఎక్కువగా నాగుపాములు… వరిపొలాల్లో ఎలకల కోసం వస్తుంటాయి. ఇక చెరుకుపొలాల్లో అయితే ఉల్లిపాయలు.. అవి మరీ ప్రమాదం. అవి కరిస్తే మనిషి కుళ్ళి కుళ్ళి చనిపోతాడు. పాములంటే నాకు భయమే. పదేళ్ల క్రితం మా ఊరి సర్పంచ్ తవుడి కొడుకు శివుణ్ణి చెరుకు పొలంలో ఉల్లిపాము కరిస్తే నలబై రోజులు మంచం పట్టి చివరకు

పాదం కుళ్ళిపోయి ఒళ్లంతా మచ్చలొచ్చి చనిపోయాడు. ఇంకోసారి సీతన్న అన్న కొడుకుని నాగుపాము కరిచింది కానీ అదృష్టవశాత్తూ బతికేడు. చిన్నప్పుడు మా నాన్న పాములుంటాయని నన్ను పొలానికి వెళ్లొద్దనీ కోప్పడేవాడు. నేను వినేవాణ్ణి కాదు. మొత్తానికి రైతులకు ఈ పాములు ఓ పెద్ద సమస్య. అయినా తప్పదు. ఒక విధంగా చెప్పాలంటే పాము రైతులకు మిత్రుడని చెబుతారు. ఎలుకలు పొలం గట్లకు బొంగలు పెడుతూ నీటిని బయటకు వదిలేస్తుంటే వాటిని మింగేసి పాములు రైతుటకు సహాయం చేస్తుంటాయి కాబట్టి అని రైతులకు మిత్రులంటారు. పెద్దలు. “బాబూ! ఈ యినయం ఇంటికాడ తెలిస్తే నన్ను పొలానికి ఎల్లనివ్వరు.

మొన్న మా పెరట్లో దొండపాదు దగ్గర దొండకాయలు తెంపుతుంటే పెద్ద పాము కనిపించింది. అప్పట్నుంచీ పామంటే భయం ఎట్టేసుకున్నారు. మావోళ్లు. అందుకే ఈ పాలి ఈ పాముల్ని వొదలను. ఈటిని సంపితీరుతాను. అప్పుడే పొలంలో భయం లేకుండా తిరగొచ్చు” అన్నాడు. కర్ర తిప్పుతూ. “సీతన్నా! ఈ సృష్టిలో అన్ని జీవులూ అవసరమే. అలాగే పాములు కూడా. వాటిని నాశనం చెయ్యాలనుకోవడం తప్పు. అయినా ఎన్నిటిని నాశనం చేస్తావు చెప్పు? వాటి పని వాటిని చెయ్యనీ. మన జాగ్రత్తలో మనం ఉండాలి” అన్నాను వాడితో.
మరో అరగంట తరువాత చీకటి పడటంతో నేను, సీతన్నా ఇంటికి బయలుదేరాం. రెండు రోజుల తరువాత నేను మళ్లీ పొలానికి వెళ్లినప్పుడు సీతన్న సర్పంచ్ కొడుకు తవుడుతో తగువు పడుతూ కనిపించాడు. నన్ను చూసి నా దగ్గరకి వచ్చాడు సీతన్న. “ఏం జరిగింది” అన్నాను. “బాబూ! వొరిసేను పొట్ట మీద ఉంది కదా. దానికి పుట్టెడు నీరు కావాల. అందుకే నిన్న సెరువులోని నీరుని పొలానికి ఎట్టినాను. ఫర్లాంగు దూరం బట్టి సరిగ్గా నేకపోతే కట్టపడి నేనూ మా రావుడూ బట్టిని బాగు చేత్తే కానీ నీరు రానేదు. కానీ ఈ పకీరుగాడు నిన్న రాతిరి మా పొలం గట్టుని తవ్వీసి నీటిని ఆడి ఎట్టేసుకున్నాడు. సూడండి మా పొలంలోని నీరంతా అది పొలానికి పోనాది.
ఇంక మాకు వంటేటి వండుతాది” అన్నాడు కోపంగా సీతన్న మాటలు విని పకీరు కూడా వేగంగా నా దగ్గరకొచ్చి “ఆది మాటలు నమ్మకండి బాబూ.. నానేటీ ఆళ్ల నీటిని ముట్టుకోనేదు. మా బట్టి నీరే మా పొలానికి ఎట్టేను” అన్నాడు పకీరు. నేను ఇద్దర్నీ తీసుకొని పొలం గట్టు దగ్గరకు వెళ్లాను. అక్కడ పారతో తవ్వినట్లు ఉంది. దాని ద్వారా సీతన్న పొలం నీరు పకీరు పొలంలోకి వెళ్లిపోయినట్లు జాడ కనిపిస్తోంది. ఆ గట్టుని చూడగానే పకీరుదే తప్పనీ నాకర్థం అయింది. “పకీరూ! ఈ గట్టుని ఎందుకు తవ్వావు?” అని అడిగాను. “నాను తవ్వనేదు.

అదెప్పట్నుంచో ఉన్నాది” అన్నాడు వాడు. “పకీరూ! నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఈ గట్టుని రాత్రే తవ్వినట్లు కనిపిస్తోంది. సీతన్న వాడి గట్టుని వాడే తవ్వుకోడు కదా. ఇటువంటి పనులు ఎప్పుడూ చెయ్యకు. సీతన్న కాబట్టి సరిపోయింది. అదే రావుడు చూస్తే పెద్ద గొడవ జరిగి ఉండేది. ఇంకెప్పుడూ ఇలాంటి పని చెయ్యకు లేకపోతే మీ అయ్యకు చెబుతాను” అన్నాను కోపంగా. వాడు నా వైపు కోపంగా చూసి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు సీతన్న కొడుకు రావుడికి ఈ విషయం తెలిసి పకీరుతో గొడవ పెట్టుకున్నాడు. పకీరు నోరు జారడంతో రావుడు కోపంతో కర్రతో గట్టిగా కొట్టాడు. అలా ఆ గొడవ ముదిరి పెద్దదైంది. ఆ తరువాత ఆ తగువు పంచాయితీ దాకా వెళ్లింది.
తనను రావుడు పొలంలో కర్రతో కొట్టాడని పకీరు వాడి తండ్రి సర్పంచ్ రామునాయుడికి ఫిర్యాదు చేసాడు. నాయుడు పంచాయితీ పెట్టి సీతన్ననీ రావుడినీ పంచాయితీకి పిలిచారు. నన్ను సాక్షిగా పిలిచారు. సీతన్న జరిగిన విషయం చెబితే పంచాయితీ సభ్యులు వాడి మాట వినలేదు. అప్పుడు నేను పకీరుదే తప్పని లిఖితపూర్వకంగా సాక్ష్యం చెప్పేను. నా సాక్ష్యం వల్ల పకీరుకి వెయ్యి రూపాయల జరిమానా వేసింది పంచాయితీ. కానీ రెండు రోజుల తరువాత ఊరిలో అగ్గి రాజుకుంది.

సర్పంచ్ రామునాయుడు వర్గం కోపంతో రగిలిపోయి సీతన్న కలుంవాళ్ల మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. ఆరు నెలల క్రితం పంచాయితీ ఎన్నికలప్పుడు ఊల్లో రెండు వర్గాల మధ్య బోలెడు గొడవలు జరిగి పోలీసు కేసులదాకా వెళ్లాయి. ఇప్పటికీ ఆ కేసుల కోసం రెండు వర్గాల వాళ్లు పోలీసే స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా ఆ కోపాలు చల్లారలేదు. మళ్లీ ఈ తగువు. పంట కోతకొచ్చే కార్తికంలో నీటి తగవులు మా ఊళ్లో మామూలే అయినా పకీరు మాత్రం నీటి విషయంలో తప్పుడు పనులు చేస్తూ గొడవలకు అజ్యం పోస్తుంటాడు. ఎంతైనా సర్పంచ్ కొడుకునని వాడికి తలబిరు సెక్కువ. వెయ్యి రూపాయల జరిమానా పకీరు కట్టలేదు సరికదా.. మర్నాడు మా పక్క ఊరి పోలీసే స్టేషన్కి వెళ్లి రావుడి మీద, సీతన్న మీద కేసులు పెట్టాడు.

దాంతో వోడిపోయిన సర్పంచ్ పోలినాయుడు వర్గం కూడా రావుడి చేత పకీరు మీద హత్యానేరం కింద ఎదురు కేసు పెట్టించింది. ఇప్పుడు ఊరు రెండుగా చీలిపోయింది. ఊల్లో తరుచూ తగువులు జరుగుతున్నాయి. రెండు వర్గాలు భయం భయంగా గడుపుతున్నారు. ఇప్పుడు ఊల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసారు. ఒకరోజు నేను పొలానికి వెళ్తున్న సమయంలో మా సర్పంచ్రా మునాయుడు వచ్చాడు. “నాయుడూ! ఆ రోజు నీ కొడుకు పకీరు తప్పు చేశాడు. నేను చెబితే మీరు నమ్మలేదు. దాని వల్ల ఎన్ని గొడవలో చూడు.
ఇప్పుడు సగం మంది మనవాళ్లు పోలీసు స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతు న్నారు.. వాళ్లు కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా పోలీసులు, లాయర్ల పాలైంది. దీని వల్ల ఏం సాధించేరు చెప్పు?” అనడిగాను కోపంగా. “బాబూ! మావోడు తప్పు చేసాడని నాకూ తెలుసు. కానీ ఆ ఎదవకి బుద్ధి నేదు. ఏదైనా అంటే మీద పడిపోతాడు. ఆడు మూర్ఖుడు, సదువుకోనేదు. అందుకే అలా తయారైనాడు” అన్నాడు నాయుడు. “ఇంక గొడవలు ఆపండి. లేకపోతే మనం సంవత్సరాల నుండి కష్టపడి సంపాదించనదంతా కోర్టుల పాలౌతుంది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు మీ గొడవల వల్ల పోలీసులు బాగుపడతారు. కలిసి ఉంటేనే పల్లెలు బాగుపడతాయి. లేకపోతే అందరూ పాడైపోతారు. నువ్వు సర్పంచ్వి. ఊళ్లో అందర్నీ సమానంగా చూడాలి.
రేపు ఊళ్లో మీటింగ్ పెట్టి కేసుల్ని వెనక్కి తీసుకోమని చెప్పు. నేను ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడుతాను” అన్నాను. “తప్పకుండా బాబూ! రేపే ఎల్లి కేసుల్ని వాపసు తీసుకుంటాం. సీతన్న గోరికి మీరు సెప్పండి” అన్నాడు నాయుడు, ఆ మర్నాడు రెండు వర్గాలు వెళ్లి కేసుల్ని ఉపసంహరించుకోవడంతో ఊళ్లో మళ్లీ ‘ ప్రశాంతత నెలకొంది. ఆ రోజు నేను పొలానికి ట్రాక్టర్ మీద వెళ్లాను. అప్పుడప్పుడు మా డ్రైవర్ లేనప్పుడు దాన్ని నడుపుకుంటూ వెళ్లడం నాకు అలవాటే. పొలంలో సీతన్న, రావుడు కనిపించారు. “ఏం సీతన్నా! పాములింకా కనిపిస్తున్నాయా?”

అని అడిగాను. “ఇప్పుడాటి గురించి ఆలోచించడం నేడు బాబూ. పాముల కన్నా యిసం మన మడుసుల్లోనే ఉంది. మనకన్నా పాములే నయం. అవి ఆటి నేటైనా సేత్తేనే కరుత్తాయి. కానీ మన దొంగనా కొడుకులు ఏటీ సెయ్యకుండానే మన – ఎనక గోతులు తవ్వుతారు. అందుకే పాములంటే భయం పోనాది. అవేటీ సెయ్యవు” అన్నాడు సీతన్న. “రావుడూ, ఇంకెప్పుడూ ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. అన్యాయం చెయ్యాలనుకున్నవాడు చివరికి పకీరులా చెడిపోతాడు” అన్నాను. ఆ తరువాత వాళ్లిద్దరూ ఇంటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో నాకెందుకో “ఖలునకు నిలువెల్ల విషము తథ్యము సుమతీ” అన్న సుమతీ శతకంలోని పద్యం గుర్తుకు వచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: