Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో చోటుచేసుకున్న ఘోర నిర్లక్ష్యం ఒక మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. ఆరోగ్య సమస్యతో క్లినిక్‌కు వెళ్లిన ఆమెను, ఎలాంటి వైద్య అర్హతలూ లేని వ్యక్తి యూట్యూబ్ వీడియోలు చూసి సర్జరీ చేయడంతో విషాదం చోటుచేసుకుంది. సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read also: Karnataka: చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లపై రేపు కేబినెట్ నిర్ణయం

YouTube operation that took lives
ఘటన వివరాలు
Uttar Pradesh: 38 ఏళ్ల మునిశ్రా రావత్ కొంతకాలంగా కడుపులో రాళ్ల సమస్యతో బాధపడుతూ వచ్చింది. ఆమె భర్త ఈ నెల 5న కోఠి ప్రాంతంలోని శ్రీ దామోదర్ ఔషధాలయం పేరుతో నడుస్తున్న ఒక క్లినిక్‌కు తీసుకెళ్లాడు. క్లినిక్ నిర్వాహకుడు గ్యాన్ ప్రకాశ్ మిశ్రా కడుపులో రాళ్లు ఉన్నాయని చెప్పి రూ.25,000 ఖర్చు అవుతుందని తెలిపాడు. ముందుగా రూ.20,000 తీసుకున్న అనంతరం, యూట్యూబ్ వీడియో చూసుకుంటూ తన మేనల్లుడు వివేక్ కుమార్ మిశ్రాతో కలిసి సర్జరీ ప్రారంభించాడు.
సర్జరీలో లోతైన కోతలు పెట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. పరిస్థితి మరింత విషమించి మునిశ్రా రావత్ మరుసటి రోజే మృతి చెందింది. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు క్లినిక్‌ను సీజ్ చేసి, నిర్లక్ష్య హత్యకు సంబంధించిన సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: