
ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ దక్షిణాది ప్రేక్షకుల కోసం భారీ స్థాయిలో సరికొత్త కంటెంట్‌ను ప్రకటించింది. మంగళవారం ‘సౌత్ అన్బౌండ్’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 18 కొత్త ప్రాజెక్టుల వివరాలను వెల్లడించింది. ఈ కార్యక్రమానికి అగ్ర కథానాయకులు కమలహాసన్, మోహన్‌లాల్, నాగార్జున (Nagarjuna) వంటి ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా నాగ్ పై విజయ్ సేతుపతి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ”నాగార్జున గారు జెంటిల్ మ్యాన్.
Read Also: Kalamkaval Movie: మలయాళం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ‘కళంకావల్’
యాంటీ ఏజింగ్‌పై రీసెర్చ్ చేయాలి
నా చిన్నప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పటికీ ఆయన అలానే ఉన్నారు. ఆయనకు వయసు ఎందుకు పెరగడం లేదో నాకు తెలియడం లేదు. యాంటీ ఏజింగ్‌పై రీసెర్చ్ చేసేవారు ఉంటే, ఈయన్ని తీసుకెళ్లి కొన్ని రోజులు పరీక్షించాలి. ఆయన హెయిర్ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకూ అలానే ఉంది. చాలా హ్యాండ్సమ్ గా, ఎనర్జీగా ఉన్నారు. చిన్నప్పుడు నేను టీవీల్లో చూసినట్లే ఉన్నాడు. సేమ్ అదే లుక్ లో ఉన్నాడు. నా మనవళ్లు పెద్దవాళ్ళైనా నాగార్జున (Nagarjuna) మాత్రం అలానే ఉంటారు” అని సరదాగా అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: