డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో ‘మాటామంతీ’ కార్యక్రమం నిర్వహించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగిన ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ ఉద్యోగులకు ధైర్యం చెప్పడంతో పాటు, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే శాఖలో పెండింగ్‌లో ఉన్న 10 వేల పదోన్నతులను పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు.
తన తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడంతో, ప్రమోషన్ కోసం కుటుంబం ఎంతకాలం ఎదురు చూస్తుందో తనకు తెలుసని పవన్ గుర్తుచేశారు. అందుకే తాను ఏ రాజకీయ సిఫార్సులు, లాబీలను పక్కన పెట్టి అర్హత, అనుభవం, పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. గ్రామాల్లో ఉద్యోగుల జీతాలు, బిల్లులు ఆలస్యం అవుతున్నాయి అని ఉద్యోగులు చెప్పగా సంతకాలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సర్పంచ్‌ల జాబితా వెంటనే తయారు చేయాలి అని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చట్టానికి వెలుపల ఎవరూ లేరని, ఉద్యోగుల జీతాలతో ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read also: తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం

సర్పంచ్‌ల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు
ఉద్యోగుల భద్రత ప్రభుత్వ ప్రాధాన్యమని పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. ఉద్యోగులపై దాడుల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అంశాలను ప్రస్తావిస్తూ టీటీడీలోని అవినీతి అన్నింటినీ బయటకు తేవడం తమ బాధ్యత అని తెలిపారు. లడ్డూ ప్రసాదం, పరకామణి వంటి పవిత్ర వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడిన వారిని చట్టం మాత్రమే కాదు, దేవుడే శిక్షిస్తాడని ఆయన వ్యాఖ్యానించారు. పల్లెల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ కీలకమని చెబుతూ, ఉద్యోగులతో సాగించిన సంభాషణ ద్వారా వారిలో ఉత్సాహం నింపినట్లు కనిపించింది. పారదర్శక పాలన, ఉద్యోగుల సంక్షేమం, అవినీతి నిర్మూలన ప్రభుత్వ ప్రాధమిక లక్ష్యాలని పవన్ కల్యాణ్ మరోసారి పునరుద్ధరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: