మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆరోగ్య సమస్యల కారణంగా గుడివాడ రాజకీయాలకు దూరంగా ఉన్న నాని, గుండె ఆపరేషన్ తరువాత కోలుకున్నారు. ఇటీవల జగన్(Jagan Mohan Reddy)ను కలిసి గుడివాడ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు వెల్లడించారు. జగన్ సూచనల మేరకు రాబోయే ఎన్నికల కోసం తాను కొత్త కార్యాచరణను రూపొందించుకున్నట్లు తెలిపారు.
Read also: ప్రభుత్వ సేవలు పూర్తి డిజిటల్: సీఎం కీలక ఆదేశాలు

18 నెలల్లో పెద్ద అలజడి?
దాదాపు 18 నెలల విరామం తర్వాత ఆయన గుడివాడలో జరిగిన పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్నికల అనంతరం ఎక్కువ కాలం హైదరాబాద్‌లోనే ఉన్నానని, కేసుల వ్యవహారాల కోసం మాత్రమే కొద్దిసేపు గుడివాడకు వచ్చేవాడినని చెప్పారు. ప్రస్తుతం వైసీపీ చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. గవర్నర్‌కు పంపే వినతి పత్రంపై సంతకం చేసి, అనంతరం ర్యాలీని ప్రారంభించారు.
వైసీపీపై కొత్త అనుమానాలు రేకెత్తించాయి
రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్య అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం జగన్ 17 మెడికల్ కళాశాలల ఏర్పాటు చేపట్టారని, అందులో ఐదు పూర్తయ్యాయని, మరో ఐదు నిర్మాణం చివరి దశలో ఉన్నాయని నాని గుర్తుచేశారు. ఈ వ్యవస్థను దెబ్బతీయాలన్న కూటమి ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకునేందుకు జగన్ ప్రజా పోరాటం ప్రారంభించారని చెప్పారు. ఈ ఉద్యమానికి ప్రజలు విశేష స్పందన ఇస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నాని డిమాండ్ చేశారు. ఆరోగ్య సమస్యలతో కొంతకాలం నియోజకవర్గం దూరమయ్యానని, ఇకపై ఆరు నెలలు పూర్తిగా గుడివాడ కేంద్రంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటానని, వచ్చే ఎన్నికలే తన లక్ష్యమని నాని ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: