దేశవ్యాప్తంగా(Modi) బ్యాంకులు,(Bank) బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్లలో భారీ మొత్తంలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు పేరుకుపోయాయి. ఈ మొత్తం రూ.1 లక్ష కోట్లకు పైగా ఉన్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. బ్యాంకులలో రూ.78,000 కోట్లు, బీమా సంస్థల్లో రూ.14,000 కోట్లు, మ్యూచువల్ ఫండ్లలో రూ.3,000 కోట్లు, డివిడెండ్ల రూపంలో రూ.9,000 కోట్లు ఇప్పటికీ క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి. ఈ నేపథ్యలో కేంద్రం ‘మీ డబ్బు మీ హక్కు’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసింది.
Read also: సర్కార్ బడి టీచర్లకు టెట్ పరీక్షతో కొత్త టెన్షన్..

ఉద్గమ్ పోర్టల్, డబ్బు తిరిగి పొందే అవకాశం
ప్రజలు(Modi) మర్చిపోయిన లేదా క్లెయిమ్ చేయని డబ్బును తిరిగి పొందేందుకు కేంద్రం అనేక మార్గాలు అందిస్తోంది. ముఖ్యంగా RBI తీసుకొచ్చిన ‘ఉద్గమ్’ (UDGAM) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా డబ్బు వివరాలను తెలుసుకోవచ్చు. పాత బ్యాంకు ఖాతాలు, ఇన్సూరెన్స్ పాలసీలు, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో ఎటువంటి డబ్బు మిగిలి ఉందో కూడా తెలుసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించినట్లుగా, ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో ప్రత్యేక శిబిరాల ద్వారా అర్హులను గుర్తించి రూ.2,000 కోట్లు తిరిగి చెల్లించబడింది. కార్యక్రమం ప్రజలకు వారి భాషల్లో అవగాహన కల్పిస్తూ, సందేహాలను నివృత్తి చేస్తోంది. ప్రధాన మంత్రి మోదీ సూచించినట్లుగా, ఈ కార్యక్రమం ద్వారా తమ డబ్బును తిరిగి పొందడం ప్రతి పౌరుడి హక్కు. అందువల్ల ఎవరూ వెనక్కి ఉండకుండా, ఈ అవకాశాన్ని ఉపయోగించి తమ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను రిక్లెయిం చేయడం సవలనం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: