ప్రజా పాలన ప్రభుత్వంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తామని, రేపటి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దాలంటే ఇప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ కర్తవ్యమని సంక్షేమ శాఖల మంత్రులు ప్రకటించారు. HYD గ్లోబల్ సమ్మిట్‌లో (Global Summit) భాగంగా తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 లో సంక్షేమ శాఖలపై జరిగిన చర్చలో మంత్రులు పొన్నం ప్రభాకర్, (Ponnam Prabhakar) అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ పాల్గొన్నారు.
Read Also: TG: మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

సంక్షేమం లేకుండా అభివృద్ధి అసాధ్యం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ శాఖలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల విజన్-2047 లో మంచి విద్య, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక ప్రణాళికల ద్వారా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 80 శాతం కంటే ఎక్కువగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం లేకుండా అభివృద్ధి అనేది అసాధ్యమని ప్రజా పాలన ప్రభుత్వం భావిస్తుందన్నారు.
సంక్షేమ శాఖల కార్యాచరణ, ప్రాధాన్యతలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు (Skill Training) ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, రిజర్వేషన్స్ అమలు, ఉన్నత విద్య, విదేశీ విద్యలకు భవిష్యత్తులో ప్రభుత్వం అన్ని రకాల ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న మేధావుల సలహాలు, సూచనలు స్వీకరించి వాటిని కార్యాచరణలో అమలు చేస్తామన్నారు.
పరిశ్రమలలో ఇంక్లూజివ్ గ్రోత్ మరియు విద్య యొక్క పాత్ర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో పరిశ్రమలు, ఐటీ, ఫార్మా, టూరిజంలలో ఇంక్లూజివ్ గ్రోత్ (Inclusive Growth) కనబడేలా సంక్షేమ శాఖలకు ప్రాథమిక కల్పిస్తున్నారని, విద్యార్థులకు ఇన్నోవేటివ్ (Innovative) కి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. నాణ్యమైన విద్య అందించినప్పుడే ఆ సమాజం మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ఈ ప్యానల్ డిస్కషన్‌లో అనితా రామచంద్రన్ (విమెన్ అండ్ చైల్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ), రిటైర్డ్ ఐఏఎస్ రెడ్డి సుబ్రమణ్యం, ప్రొఫెసర్ సుఖదేవ్ తోరబ్ (మాజీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్), ప్రొఫెసర్ కాశీం, బుర్ర వెంకటేశం (టీజీపీఎస్సీ చైర్మన్), ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ (మహిళా యూనివర్సిటీ వీసీ) వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: