हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Telugu news: TTD: అన్యమత ఉద్యోగుల సమస్యలపై పాలకమండలి కీలక నిర్ణయం

Tejaswini Y
Telugu news: TTD: అన్యమత ఉద్యోగుల సమస్యలపై పాలకమండలి కీలక నిర్ణయం

Tirumala employees issue: తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) పనిచేస్తున్న హిందూేతర ఉద్యోగుల అంశంపై అధికారాలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ముందడుగు వేశాయి. పాలకమండలి చేసిన రెండు ముఖ్యమైన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించడంతో, తదుపరి చర్యల కోసం టీటీడీ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. న్యాయపరమైన సమస్యలు రాకుండా ప్రక్రియను పూర్తిచేయేందుకు అధికారులు సమగ్ర వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు.

టీటీడీ బోర్డు ఇటీవల జరిగిన సమావేశంలో హిందూేతర ఉద్యోగుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది. వీరికి రెండు ఆప్షన్లు సూచించాయి

  1. స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)
  2. ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ

Read Also: Tirumala: శ్రీవారి బంగారు డాలర్లు మళ్లీ అందుబాటులో

    TTD: Governing Council takes key decision on issues of non-religious employees

    మొదటి ఎంపికగా వీఆర్‌ఎస్‌ను ఎంచుకున్నవారికి మిగతా సేవాకాలానికి సంబంధించిన జీతభత్యాలు ఒకేసారి చెల్లించే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోనివారిని సంబంధిత ప్రభుత్వ విభాగాలకు బదిలీ చేసే ప్రక్రియను చేపడతారు. ఈ రెండు ఆప్షన్లలో ఉద్యోగుల ఇష్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పాలకమండలి నిర్ణయించింది.

    40 మంది అన్యమత ఉద్యోగులపై నిర్ణయ

    టీటీడీ(Tirumala tirupathi devasthanams)లో ఇతర మతాలకు చెందిన కొంతమంది, హిందూేతరుల నియామకంపై నిబంధనలు అమల్లోకి రాకముందే ఉద్యోగాల్లో చేరినట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది ఇప్పటికే రిటైరయ్యారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారి సంఖ్య సుమారు 40 మాత్రమేనని తెలుస్తోంది. ముందు వీరికి వీఆర్‌ఎస్‌ ఆఫర్‌ను అందిస్తూ సర్క్యులర్‌ ఇవ్వనున్నారు. వీఆర్‌ఎస్‌కు అంగీకరించని వారి జాబితాను దేవదాయ శాఖ మైనారిటీ సంక్షేమ శాఖకు పంపనుంది. అక్కడున్న ఖాళీల ఆధారంగా వారికి బదిలీలు అమలు చేస్తారు.

    టీటీడీ తీసుకున్న ఈ చర్యలు సంస్థలో విధానపరమైన స్పష్టతను తీసుకువస్తాయని అధికారులు భావిస్తున్నారు.

    Read hindi news: hindi.vaartha.com

    Epaper: epaper.vaartha.com

    Read also:

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    📢 For Advertisement Booking: 98481 12870