Today Rasi Phalalu : రాశి ఫలాలు – 10 డిసెంబర్ 2025 Horoscope in Telugu
మేష రాశి
ఈ రోజు మేష రాశివారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. పండితులు, ప్రముఖులను కలిసే అవకాశాలు ఏర్పడతాయి. వారి సూచనలు మీకు కొత్త దిశను చూపిస్తాయి. మీ ప్రతిభను గుర్తించే వారు ఊతమిస్తారు.
వృషభరాశి
వృష్టభ రాశివారికి ఈ రోజు అనుకూలంగా సాగుతుంది. చేపట్టిన పనుల్లో కొన్ని విజయవంతంగా పూర్తికావడం మీలో నమ్మకం పెంచుతుంది.
…ఇంకా చదవండి
మిథున రాశి
మిథున రాశివారికి ఈ రోజు ఉద్యోగ రంగంలో కొంత అప్రమత్తత అవసరం. సహోద్యోగులతో అకారణంగా విభేదాలు లేదా మాటా మాటా పెరగే అవకాశాలు ఉన్నాయి.
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి ఈ రోజు సేవా భావం మరింత పెరుగుతుంది. సంఘసేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉంటుంది. మీ సహాయం వల్ల ఇతరులకు ఉపయోగం జరుగుతుందనే భావన మీలో మంచి సంతృప్తిని కలిగిస్తుంది.
…ఇంకా చదవండి
సింహ రాశి
సింహ రాశివారికి ఈ రోజు కుటుంబ సంబంధ విషయాల్లో అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా సంతానం పురోభివృద్ధి విషయంలో శుభ వార్తలు లేదా సానుకూల సంకేతాలు కనిపిస్తాయి. ఇంటి వాతావరణం ఆనందంగా మారుతుంది.
…ఇంకా చదవండి
కన్యా రాశి
కన్య రాశివారికి ఈ రోజు కుటుంబ రంగంలో శుభసూచనలు కనిపిస్తాయి. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా కదులుతాయి. ఇంట్లో శాంతి, సౌహార్దం మరింత మెరుగవుతాయి.
…ఇంకా చదవండి
తులా రాశి
తులా రాశివారికి ఈ రోజు ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా షేర్లు, భూములు, స్థిరాస్తికి సంబంధించిన క్రయ–విక్రయాలలో ఆశించిన లాభాలు అందే అవకాశాలు ఉన్నాయి.
…ఇంకా చదవండి
వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారికి ఈ రోజు రాజకీయ, సాంకేతిక రంగాల్లో పనిచేసే వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. మీ పనికి మంచి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి.కొత్త అవకాశాలు ఎదురుపడుతూ, మీరు ముందుకు సాగేందుకు దోహదం చేస్తాయి.
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారికి ఈ రోజు ధైర్యం, స్థిరత్వం ప్రధాన బలాలుగా నిలుస్తాయి. సమాధానం లేని, పరిష్కారం కాని అంశాల్లో కూడా మీరు నిబ్బరంతో, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు.
…ఇంకా చదవండి
మకర రాశి
మకర రాశివారికి ఈ రోజు తెలివైన వ్యవహారశైలి కీలకం. ముక్కుసూటితనంపై కాకుండా లౌక్యంతో, శాంతంగా వ్యవహరిస్తే పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా సులువుగా సాధించగలుగుతారు.
…ఇంకా చదవండి
కుంభ రాశి
కుంభ రాశివారికి ఈ రోజు మౌనం పెద్ద ఆయుధంగా మారుతుంది. చాలామందికి మీరు మౌనమే సమాధానంగా ఇస్తారు. అవసరం లేని వాదోపవాదాలను తప్పించుకోవడం వల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
…ఇంకా చదవండి
మీన రాశి
మీనం రాశివారికి ఈ రోజు మంచితనం మరియు సమయస్ఫూర్తి ప్రధాన బలాలుగా మారతాయి. మీరు చూపే సహనం, నైతికత అభివృద్ధికి అవసరమైన వనరులను సమకూర్చుకునే అవకాశాలను కల్పిస్తాయి.
…ఇంకా చదవండి
వారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశిర మాసం(Margashira Masam), దక్షిణాయణం శరద్ ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)