हिन्दी | Epaper
పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

News Telugu: Chandrababu:: సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్: సిఎం చంద్రబాబు

Rajitha
News Telugu: Chandrababu:: సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్: సిఎం చంద్రబాబు

విజయవాడ : డ్రోన్ సేవలు మరింత విస్తృత పరచాలి. ఆర్టీజిఎస్ సమీక్షలో సిఎం చంద్రబాబు వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలూ ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. ఈ దిశగా ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీజీఎస్పై సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి నుంచి ప్రజలకు అన్ని సేవలు ఆన్ లైన్లోనే అందజేయాలన్నారు. ఆన్లైన్లో సేవలు అందించడం ద్వారా ప్రజలకు సేవలు పారదర్శకంగా అందడంతో పాటు వారిలో ప్రభుత్వ పని తీరు పట్ల సంతృప్త స్థాయి పెరుగుతుందన్నారు. ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలందిస్తున్నాయని అలాంటి శాఖలు వెంటనే తమ పంథా మార్చుకుని ప్రజలకు ఆన్లైన్లో సేవలందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలన్నీ, ప్రభుత్వ కార్యాలయాలకు తిరగనవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

Read also: Pawan Kalyan: రేపు పీఆర్, ఆర్డీ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం ‘మాటామంతీ’

All services online from Sankranti

All services online from Sankranti

భవిష్యత్తులో డ్రోన్ల ఉపయోగం

రిజిస్ట్రేషన్ల అనంతరం డాక్యుమెంటు కొరియర్ ద్వారా నేరుగా సంబంధిత వ్యక్తుల ఇళ్లకే పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ సేవలు మరింత మెరుగయ్యేలా చూడాలన్నారు. బస్టాండు ప్రాంగణం, పరిసరాలు, టాయ్లెట్ల వద్ద పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు ఉండాలని సీఎం అన్నారు. డ్రోన్ సేవలు మరింత విస్తృత పరిచాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో డ్రోన్ల ఉపయోగం గణనీయంగా పెరుగుతుందన్నారు. పురుగు మందుల వినియోగం తగ్గించేందుకు డ్రోన్లను ఎలా వాడుకోవచ్చోననే అంశంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పారిశుధ్యం నిర్వహణ ద్వారా వ్యాధుల వ్యాప్తి లేకుండా చేయవచ్చని తెలిపారు. కొన్ని జిల్లాల్లో కొంతమంది అధికారులు మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని… అలాగే కొందరు అవలంభించే మంచి పద్దతులను గుర్తించి మిగిలిన జిల్లాల్లో కూడా అమలయ్యేలా చూడాలని సీఎం సూచించారు.

10లక్షలకు పైగా మార్గదర్శకులు

ఈ సమీక్షలో సీఎస్ విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పి4జీరో పావర్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష అధికారులతో సమీక్షను నిర్వహించారు.పి4 అమల్లో బంగారు కుటుంబాలకు అవసరమైన సాయంపై నిర్వహించిన సర్వేపై అధికారులతో సిఎం సమీక్షలో పలు అంశాలపై మార్గదర్శకాలు చేసారు. మార్గదర్శకులు ఈ కార్యక్రమంలో మనింతగా ముందుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పీ4 సర్వేలో వైద్యసాయం, ఉద్యోగం, చిరు వ్యాపారాల విస్తరణ, వ్యవసాయం, నూతన ఆవిష్కరణలు, ఉన్నత విద్య, నైపుణ్యాల పెంపుపై సాయం కోరిన బంగారు కుటుంబాలకు ఆ దిశలో మార్గదర్శకుల నుంచి సాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పేదరిక నిర్మూలన దిశలొ మనం చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పటికే మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. 10లక్షలకు పైగా మార్గదర్శకులు ఈ కార్యక్రమంలోకి రావాలనే లక్ష్యదిశను అధిగమించడంతో పాటు ఇప్పటికే ఉన్న బంగారు కుటుంబాలతో పాటు రెట్టింపు సంఖ్యలో కుటుంబాల అవసరతల తీరాలన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870