Telangana Rising Summit 2025 : గ్లోబల్ వ్యాపార వాతావరణానికి పెద్దపీట వేసే నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతర్జాతీయ పెట్టుబడి సమ్మిట్‌లలో చురుకుగా పాల్గొనడం, అలాగే రాష్ట్రంలో కూడా ఇలాంటి గ్లోబల్ ఈవెంట్స్‌ను నిర్వహించడం ఆయన నాయకత్వ లక్షణాల్లో ముఖ్యమైనవి.
ఇప్పటికే ఆ దారిలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఈ రోజు ప్రారంభమవుతున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025”కు రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఈ భారీ పెట్టుబడి సదస్సుకు ప్రపంచంలోని అనేక దేశాల ప్రతినిధులు హాజరవుతుండగా, తెలంగాణ అభివృద్ధి అవకాశాలను గ్లోబల్ స్థాయిలో ప్రదర్శించే ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి.
Read Also: Sairat Movie: ఇండియన్ బాక్సాఫీస్‌ను కుదిపేసిన ‘సైరాట్’ సక్సెస్ స్టోరీ
ఈ కీలక ఈవెంట్‌కు ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు.
“తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వేదిక వృద్ధి, ఆవిష్కరణలు మరియు అభివృద్ధికి కొత్త మార్గాలు తెరచాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ ఆయన సందేశం పెట్టారు.
దీనికి వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి,
“#TelanganaRising గ్లోబల్ సమ్మిట్‌కు శుభాకాంక్షలు అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేశారు.
ఈ పరిణామం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల (Telangana Rising Summit 2025) మధ్య ఉన్న పరస్పర గౌరవం, సానుకూల సంబంధాలు మరోసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ స్నేహపూర్వక వాతావరణం భవిష్యత్తులో రెండు రాష్ట్రాల సంయుక్త అభివృద్ధికి దోహదపడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: