శంషాబాద్‌లోని(Shamshabad) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Indigo Airlines) ఇండిగో సమస్యలు తగ్గే సూచనలు కనిపించడంలేదు. వరుసగా ఏడో రోజూ సోమవారం సంస్థ భారీగా 112 విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత వారం రోజుల్లోనే 600కు పైగా సర్వీసులు రద్దు కావడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టమైంది. డిసెంబర్ 5న ఒక్కరోజే 155 విమానాలు రద్దు కావడం రికార్డుగా నిలిచింది. ఆకస్మిక రద్దుల కారణంగా వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే నిలిచిపోవాల్సి వచ్చింది. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సిబ్బందిని ప్రశ్నించడంతో భద్రత కోసం సీఐఎస్ఎఫ్ అదనపు బలగాలను మోహరించారు.
Read also: గ్లోబల్ సమ్మిట్‌పై కే.ఏ. పాల్ తీవ్ర విమర్శలు

కొత్త FDTL నిబంధనలే కారణమంటున్న ఇండిగో
ఇండిగో(Indigo Airlines) యాజమాన్యం ప్రకారం, పైలట్ల విశ్రాంతి సమయాన్ని పెంచే కొత్త FDTL (Flight Duty Time Limit) నిబంధనలే రద్దులకు ప్రధాన కారణం. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, విశాఖ, గోవా వంటి కీలక రూట్లలో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండిగో డిసెంబర్ 15 వరకు బుకింగ్‌లపై రద్దు మరియు రీషెడ్యూలింగ్ ఛార్జీలను మినహాయించింది. ఇదే సమయంలో సంస్థ అభ్యర్థన మేరకు డీజీసీఏ ఫిబ్రవరి 10 వరకు FDTL నిబంధనల్లో తాత్కాలిక సడలింపు ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: