హైదరాబాద్‌లో మనసును హత్తుకునే మనుషత్వం మరోసారి వెలుగుచూసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఆహారం కోసం ఇబ్బందులు పడే వారికి అండగా నిలవాలని సంకల్పించిన జార్జ్ రాకేశ్ బాబు “కరుణ కిచెన్” పేరుతో ప్రత్యేక సేవ ప్రారంభించారు. అలసటతో, ఆకలితో తిరిగే వారు కనీసం ఒక్కరోజు భోజనం కోసం ఆందోళన చెందకూడదనే భావంతో, ఉదయం ఒక్క రూపాయికే టిఫిన్ అందిస్తున్నారు.
Read also: HYD Crime: హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం

Karuna Kitchen
రోజుకి దాదాపు 300 మంది ఆకలి
ప్రతిరోజూ మెనూను మార్చుతూ, ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకూ రెండు గంటలపాటు ఈ సేవ కొనసాగుతుంది. రోజుకి దాదాపు 300 మంది ఆకలి తీర్చుకుంటున్నారు. “డబ్బు సంపాదించడమే లక్ష్యం కాదు. నలుగురి కడుపు నింపగలగడం నా నిజమైన ఆనందం” అని రాకేశ్ బాబు చెప్పడం మనసుకు హత్తుకునే విషయం. రైల్వే స్టేషన్ ప్రాంతంలో నిరాశ్రయులు, కూలీలు, ప్రయాణికులు అందరికీ ఈ సేవ ఆశాకిరణంలా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: