తెలంగాణలో (Telangana) గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11న పోలింగ్ జరగబోతోందని, ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలులో ఉండేలా రేపు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ రాత్రి వరకూ వైన్స్ షాపులు, బార్లు, రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
Read also: TG High Court: ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Alcohol will be banned
ఎన్నికల్లో మొత్తం 4,236 స్థానాలకు పోలింగ్
ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఈ ‘డ్రై డే’ కఠినంగా అమలులో ఉంటుందని, ఎవరైనా ఈ ఆంక్షలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో మొత్తం 4,236 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రజలు ప్రశాంతంగా ఓటు వేయడానికి, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: