తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి హైకోర్టు (TG High Court) లో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెను తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ అక్టోబరులో డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఆమె క్యాట్‌లో సవాల్ చేశారు. దీంతో ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: TG: రామగుండం థర్మల్ మూసివేత
తదుపరి విచారణను హైకోర్టు 6 వారాలకు వాయిదా
అయితే.. క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డీఓపీటీ తెలంగాణ హైకోర్టు (TG High Court) లో అప్పీల్‌కు వెళ్లింది. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది. అప్పటివరకు క్యాట్ ఉత్తర్వులు అమలులో ఉండవని, వాటిపై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా కౌంటర్ దాఖలు చేయాలని ఐఏఎస్ ఆమ్రపాలి (IAS Amrapali) తరఫు న్యాయవాదికి కూడా హైకోర్టు ఆదేశించింది.

కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ ఆమ్రపాలిని హెచ్ఎండీ జాయింట్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించారు. అయితే డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీ కేడర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ తర్వాత క్యాట్‌లో అప్పీలు చేయగా.. తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా.. క్యాట్ ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: