Suriya new movie : టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లో కూడా స్టార్ ఇమేజ్ ఉన్న తమిళ హీరో సూర్య, మలయాళ దర్శకుడు జితు మాధవన్‌తో చేతులు కలిపారు. ‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి హిట్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న జితు మాధవన్‌కు ఇది తొలి తమిళ సినిమా కాగా, సూర్య కెరీర్‌లో ఇది 47వ చిత్రం కావడం విశేషం.
Read Also: Sairat Movie: ఇండియన్ బాక్సాఫీస్‌ను కుదిపేసిన ‘సైరాట్’ సక్సెస్ స్టోరీ
ఈ సినిమా చెన్నైలో ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడగా, ప్రధాన నటీనటులు మరియు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ చిత్రంలో మలయాళ నటి నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా నటిస్తున్నారని (Suriya new movie) మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అలాగే ‘ప్రేమలు’ చిత్రం ఫేమ్ నెస్లాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సుషిన్ శ్యామ్ సంగీతం అందించనుండగా, వినీత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించనున్నారు. షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ మరియు ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: