ఊరు. ఈ పేరు పలకడానికి ఎంత. బాగుందో కదా! పుట్టి పెరిగిన ప్రాంతంలో అందరికీ ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉంటాయి. సాయంత్రం వేళ ఆకాశంలో ఎగురుతూపోయే పక్షులను చూసి సంతోషపడిన రోజులు ఎన్నో కదా. అలాంటి ఓ పక్షి కథే నా ఈ తల్లి (Mother)ప్రపంచం, అదొక అందమైన ఊరు. పేరు ఆంజనేయ కొట్టాల, పచ్చని పొలాలు ఒకవైపు, పక్షుల గుంపు మరోవైపు. వయసు పైబడిన భార్య భర్తలిద్దరూ జొన్నపొలంలో కంకి 3 కోస్తున్నారు.

అప్పుడే గింజల కోసం జొన్నకంకిపై పక్షివాలింది. పక్కనే ఉన్న గూడులో నుంచి బుల్లిపిట్ట తల్లిని చూస్తూ ఉంది. ఆకలిగా ఉంది అనుకుంటా! చిన్న గొంతుతో అరుస్తూ ఉంది. చూస్తూ ఉండగానే, తల్లి రెక్కలు తీగల్లో ఇరుక్కుపోయాయి. ఎంత ప్రయత్నించినా రావడం లేదు. అదంతా బుల్లిపిట్ట చూస్తూ ఉంది. తల్లి పడుతున్న వేదన తనను ఎంతో కలిచివేసింది.
ఎగరలేని తన నిస్సహాయతను తలచుకుని తల్లిని చూస్తూ అరవ సాగింది. బిడ్డ అరుపులు విన్న పక్షి, తన శక్తిని కూడకట్టుకుని ఎగరడానికి ప్రయత్నించింది. ఎగిరే ప్రయత్నంలో రెక్క విరిగిపోయింది. విరిగిన రెక్కతో ఇంటికి చేరింది తల్లి పక్షి. రెప్పల నిండా కన్నీళ్లతో బుల్లిపిట్ట తల్లిఒడిలో చేరింది. కోత కోసేసిన భార్యాభర్తలు ఇంటికి వెళ్లిపోయారు. గింజలు లేక ఆకలితో అలాగే పడుకున్నారు. బుల్లి పిట్ట, తల్లిపక్షి.

ఉదయం అయింది. బిడ్డ ఆకలితో రాత్రి సరిగా పడుకోలేదు అని తెలిసిన తల్లి పక్షి ఎగరడానికి ప్రయత్నం చేసింది. కాని సాధ్యం కాలేదు. బుల్లిపిట్టను చూసి కన్నీటి పర్యంతం అయింది. అప్పుడే విపరీతంగా గాలి వీస్తుంది. జొన్న చేను గాలికి వాలిపోయింది. గాలి తీవ్రత ఇంకొంచెం ఎక్కువ అయింది.
దానితో బాగా ఎండిన జొన్నకంకి విరిగిగాలికి లేచింది. అదంతా బుల్లిపిట్ట వింతగా చూస్తూ ఉంది. గాలిలో లేచిన జొన్న కంకి, వారి గూడుని దాటుతూ వెళ్తుండగా, వెంటనే తల్లిపక్షి నోటితో కంకిని గట్టిగా పట్టుకుంది. బుల్లిపిట్ట ఒక్కసారిగా తల్లి పక్షివైపు చూసింది. తల్లి తన బిడ్డపైన కురిపించే ప్రేమ, అమృతం కన్నా విలువైనది. తల్లి ప్రేమను వెలకట్టే కొలమానం ఇప్పటివరకు కనుగొనబడలేదు. అందరి ప్రపంచ ఏమో కానీ తల్లికి మాత్రం బిడ్డే ప్రపంచం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: