हिन्दी | Epaper
అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’

whirlpool of floods : వరద సుడిలో బతుకు మునక

Abhinav
whirlpool of floods : వరద సుడిలో బతుకు మునక

మనసుకు పోయి గొలిపే ఎన్నో అద్భుతాలు ఈ ధరణీ మండలంపై కొలువై ఉన్నాయి. న్నాయి. అపారమైన ఆపారమైన జలనం. పద భూతచాన్ని సస్యశ్యామలం చేస్తున్నది. కోటాను కోట్ల జీవరాశుల మనుగడకు ఆధారంగా నిలుస్తున్న ది. ఉవ్వెత్తున ఉప్పునీటి సంద్రాల కెరటాలు ఎగసిపడుతున్నాయి. విజ్ఞతతో వినియోగించు కుంటే కడలి గర్భంలో నిక్షిప్తమైన సంపదలు మానవాళికి ఉపయోగపడతాయి. ఉప్పునీటి సంబ్రాలు ఎన్నో దేశాల ఆర్థికాభివృద్ధికి ఆధారంగా నిలుస్తున్నాయి. జీవజాతుల మనుగడకు నిర్దేశిస్తున్నాయి. పెద్దపెద్ద పర్వతాలు, లోయలు, అరణ్యాలు, నదీనదాలు ప్రకృతి శోభను భూములను కోసం అడవుల ఆధిపత్యం అవసరానికి. భూగర్భనింగినంకి ఇనుమడింపచేస్తున్నాయి. ఈ సమస్త జగతి ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న విషయం మరువలేం. పచ్చికబయళ్లలో మేస్తున్న పాడిపశువులు, చెంగు చెంగున ఎగురుతున్న లేగదూడల పదఘట్టనలు, అరణ్యాల్లో ఆహారంలో కోసం శ్రమిస్తున్న వన్యప్రాణులు, పెద్దపులుల గాండ్రింపులు, చిరుత పులుల చురుకైన వేగం, సింహగర్జనలు, ఏనుగుగుంపుల ఘీంకారాలతో అనునిత్యం మనుగడ కోసం పోరాటం జరుగుతున్నది. పురివిప్పి నాట్యం చేస్తున్నమయూరాలు ఒకవైపు, ఎగిరి గంతేస్తున్న జింకలు మరోవైపు, కాకులు, కొంగలు, చిలుకలు, పావురాలు ఇంకోవైపు, రాబంధులు, గ్రద్దలు, క్రిమికీటకాదులు మరోవైపు ఈ ప్రకృతిలో మమేకమై జీవిస్తున్నాయి. సకల జీవకోటిలో మానవ విజ్ఞానానికి సాటి మరొకటి లేదు. 

ఇదే మానవాధిపత్యానికి, అహంభావానికి బీజం వేసింది. ఆహారం కోసం వేటాడే సంస్కృతిని వదిలిపెట్టి, అడవుల్లో నివసించడం మాని మనకంటూ ప్రత్యేక నివాసాలను ఏర్పాటు చేసుకున్నాం. జనాభా సంఖ్య పెరిగింది. జనావాసాల కోసం అడవులను నరికేస్తున్నాం. అరాధా అవసరాలకోసం వంట భూములను విధ్వంసం చేస్తున్నాం. అభివృద్ధి పేరుతో ఆకాశాన్నంటే భవంతులు నిర్మించుకుంటున్నాం. పంచ భూతాలపై ఆధిపత్యం చెలాయించాలనే ధోరణి ప్రబలింది. భూగర్భ సంపదను వినియోగిస్తున్నాం. భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నాం. కాంక్రీటు కట్టడాలతో, విశాలమైన రోడ్లతో నీరు ఇంకే మార్గం లేకుండా చేస్తున్నాం. నీరు బయటకుపోయే మార్గాలను బంధించేస్తున్నాం, చెరువులను, నాలాలను కబ్జా చేసే, నింగినంటే సాధాల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నాం. సముద్రాలను కలుషితం చేసి, నదులను వ్యర్థాలతో నింపేసి, చెరువులను విధ్వంసం చేసి, పచ్చని చెట్లను నరికేసి ప్రకృతిని వికృతంగా మారుస్తున్న ఫలితమే ప్రళయానికి సంకేతంలా మారుతున్నది. జనవిస్ఫోటనం జరిగింది. జలసంక్షోభం పెరిగింది. జనారణ్యాలు కాలుష్యానికి కేరాఫి అడ్రస్గా మారిపోయాయి. పంట భూములన్నీ రసాయన పదార్థాలతో నిస్సారమవుతున్నాయి. ఆహారపదార్ధాలు విషపూరితమైపోతున్నాయి. గాలి. కాలుష్యం, నీటి కాలుష్యంతో మానవ జీవితాలు సంకట స్థితిలోకి నెట్టబడుతున్నాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నాం. 

వివిధ రకాల పరిశ్రమల వలన వెల్లువెత్తుతున్న కలుషిత పదార్థాలతో గాలి కాలుష్యం, జలకాలుష్యం పెరిగింది. దీని కారణంగా. వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. భూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రగర్భంలో పేరుకుపోతున్నాయి. ఆకస్మిక వాతావరణ మార్పులతో కుండపోత వర్షాలు పడి వరదలు (floods)ముంచెత్తుతున్నాయి. ఒకవైపు అతివృష్టి మరోవైపు అనావృష్టి, ఒకవైపు వరదలు… మరోవైపు ముంపుతో జనం పోరాటం. మన కళ్లెదుట అపారమైన జలసంపద అక్కరకు రాని చుట్టంలా వచ్చి సముద్రాలకు వయనమవుతున్నది. వరద నీటితో ఊళ్లన్నీ మునిగిపోతున్నా, తాగేందుకు నీరు మాత్రం లభ్యం కాని విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. మానవాధిపత్యం మానవ మనుగడను ప్రశ్నిస్తున్నది. ప్రకృతిలో పచ్చదనం హరించబడింది. కాలుష్యంతో, రసాయనాల వాడకంతో అనేక జీవరాశులు అంతర్ధానమైపోతున్నాయి. మరికొన్ని జీవరాశుల ఉనికి ప్రమాదంలో పడింది. ధూళి, దుర్గంధంతో, వ్యవసాయ వ్యర్థాల దహనంతో ఢిల్లీ వంటి నగరాల్లో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. శ్వాసకోస వ్యాధులు ప్రబలిపోతున్నాయి. మనం పీల్చేగాలి కాలుష్యభరితంగా మారింది. ప్రాణవాయువు హరించుకుపోయి ప్రాణాలను తోడేస్తున్నది. కడివెడు గుమ్మడికాయ కత్తిపీటకు లోకవైనట్లు, కంటికి కనిపించని సూక్ష్మజీవరాశులు మానవ జీవితాలను మరణశయ్యపైకి నెడుతున్నాయి. పచ్చదనంతో, పాడిపంటలతో, పలు రకాల జీవరాశులతో, జలరాశులతో, సహజ వనరులతో ఆరోగ్యవంతంగా సాగవలసిన మానవ జీవితాలు ప్రకృతి విధ్వంసం వలన తలెత్తినతావరణ వాతావరణ హెచ్చరికలు, పెరిగిన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంగాని మార్పులతో, ప్రకృతి విలయాలతో అతలాకుతలమైపోతున్నాయి. 

ప్రకృతి విలయాలను నిరోధించలేకపోతున్నాయి. ప్రకృతి ప్రకోపిస్తే మానవ జీవితాలు తల్లకిందులవుతాయి. ప్రకృతి ప్రళయగర్జన ముందు మానవ విజ్ఞానం, మేథస్సు మోకరిల్లకతప్పదని, జలప్రళయం సంభవిస్తే కళ్లుమూసి, తెరచేలోగా ఎన్నో బతుకులు తెల్లారక తప్పవని ఇటీవల కేరళలోని వయనాడ్ జిల్లాల్లో సంభవించిన ప్రకృతి విలయవిధ్వంసం నిరూపిస్తున్నది. ఒకప్పటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు హస్తిమశకాంతమంత వ్యత్యాసముంది. ఒకప్పుడు మనసును హత్తుకునే సహజమైన సోయగాలతో ప్రకృతి పులకరించి చిరుదరహాసం చేసింది. కొండల్లో, కోనల్లో, జలపాతాల హోరులో జనజీవన సౌందర్యం వికసించి నర్తించింది. నదీపరివాహకాల్లో నాగరికత విలసిల్లింది. పచ్చదనం ధరించిన ప్రకృతి ప్రేమామృతంలో సకలజీవకోటి తరించి మురిసింది. నింగిలోని తారకలు మిలమిలా మెరుస్తుంటే, నెలవంక నేలపై ప్రకృతిశోభను ద్విగుణీకృతం చేసింది. రాత్రి నిద్దురమత్తులో జగతి నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది. తూర్పు ఉదయకాంతులు విచ్చుకుని, చెట్ల కొమ్మలపై గూడు కట్టుకుని విశ్రమిస్తున్న పక్షులను మేలుకొలిపాయి. పొద్దుపొడుపు చీకటిని తరిమింది. నిశ్శబ్దాన్ని చేధించింది. మన స్వార్ధమే మన నాశనం జనజీవనాన్ని మేలు కొలిపింది. పర్వతాలతో, సంద్రాలతో, నదీనదాలతో, అరణ్యాలతో జీవవైవిధ్యంతో, భౌగోళిక వైరుధ్యాలతో సకల జీవరాశుల మనుగడ భూతలంపై సజావుగా సాగుతున్న తరుణంలో మానవస్వార్థం బుసలు కొట్టింది. పచ్చదనాన్ని సంహరించింది. అరణ్యాలు నశించాయి. కొండలు పిండికాబడ్డాయి. 

కాంక్రీటు కట్టడాలు వెలిసాయి. భూగర్భాన్ని విచ్ఛిన్నం చేసి బంగారుబాతు లాంటి సంపదలను దోచేసి, ధరిత్రికి వ్యథ కలిగించాం. కొండలనే కాదు లోయలను కూడా స్వార్థానికి వినియోగించుకున్నాం. సముద్రాలు, నదులన్నీ వ్యర్థాలతో నింపబడ్డాయి. మానవజ్ఞానం ప్రకృతిని కాలదన్ని ఆధిపత్యం చెలాయించింది. ప్రకృతి సమతుల్యం దెబ్బతిన్నది. మానవ స్వార్ధంతో శోభించింది. వికృతంగా మారింది. తప్పటడుగులను సరిచేసుకోవాలని పర్యావరణం హెచ్చరించింది. అవి తప్పటడుగులు కావు, తప్పుటడుగులని అవగతమైనది. ప్రకృతి ఆగ్రహించింది. ప్రళయగర్భన చేసింది. ప్రకృతి విలయంలో మానవ ప్రాణదీపాలన్నీ క్షణాల్లో ఆరిపోయాయి. సుగంధాలు అద్దుకున్న మానవదేహాలు శవాల గుట్టలై బురదలో దిగబడి దుర్గాంధాన్ని వ్యాపింపచేసాయి. ఇదీ ఇటీవల కేరళలోని వయనాద్ జిల్లాలో సంభవించిన ప్రకృత ఉత్సాహం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం తదితర చోట్ల సంభవించిన పరదలు కూడా ప్రకృతి వైపరీత్యాల ఫలితమే, మానవ తప్పిదాలు లిఖించిన మరణ శాసనాలే. కేరళలో ఇటీవల సంభవించిన నరద బీభత్సం గురించి, ఇతర రాష్ట్రాల్లో సంభవించిన వరదల గురించి, వాతావరణ మార్పుల గురించి, ప్రకృతి వైపరీత్యాల వలన కలిగే ప్రాణనష్టాన్ని కనీసస్థాయికి తగ్గించడం గురించి, ప్రకృతి వైపరీత్యాలకు గల కారణాలేమిటి? ప్రకృతి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలను ప్రస్తావించేముందు కేరళలోని వయనాడ్ జిల్లా గురించి, కేరళను తరచుగా ముంచెత్తుతున్న నరదలకు గల కారణాలను, అక్కడ జరుగుతున్న ప్రకృతి విధ్వంస కార్యకలాపాలను గురించి, వాటిని ఎలా అరికట్టాలి? ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలి? అనే విషయాల గురించి విపులంగా తెలుసుకుందాం. 

కేరళలో ప్రకృతి వైపరీత్యం జరగడం ఇది మొదటిసారి కాదు. 2018వ సంవత్సరంలో కురిసిన భీకదవర్గాలకు 483మంది మరణించగా, 14లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2019లో వయనాడ్లో స్వల్పసంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. 2021, 2022వ సంవత్సరంలో కేరళలో కొండచరియలు విరిగిపడి పలువురి మరణించారు. 2018వ సంవత్సరంలో కురిసిన వర్షాలు, ప్రకృతి విలయం వంటి భయానక పరిస్థితులు ఈ ఏడాది మరోమారు పునరావృతమైనాయి. వయనాడ్ జిల్లా మొత్తాన్ని ప్రకృతి విలయం నాశనం చేసింది. ఇండియాలో వర్షాలను, కాలాలను నిర్దేశించడంలో పశ్చిమ కనుమలు కీలకభూమిక పోషిస్తున్నాయి. పశ్చిమ కనుమలు సుమారు లక్షా అరవైవేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నా 3. 48శాతం పశ్చిమ కనుమలు కేరళలో విస్తరించి ఉన్నాయి. కేరళలోని 44 ప్రధాన నదుల్లో 41నదులు పశ్చిమ కనుమల్లో ఉద్భవించాయి. కేరళలో పశ్చిమ కనుమలు 9993.7 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణత కలిగి ఉన్నాయి. వయనాడ్ జిల్లాలోని కొండచ రియలు విరిగిపడే 13 గ్రామాలు ఈ పశ్చిమకనుమల్లోనే ఉన్నాయి. మాటల్లో వర్ణించలేని విధ్వంసం కేరళలోని ఒకే ఒక పీఠభూమి వయనాడ్, ‘వయనాడ్’ అనే పదం వయల్ నాడ్ నుండి వచ్చింది. ‘వరి పొలాల భూమి’ అని దీని అర్థం. వయనాడ్, ఇడుక్కి, కాసర్గాడ్ జిల్లాలు కేరళలో తక్కువ జనాభా, తక్కువ జనసాంద్రత గల జిల్లాలు. వయనాడ్ జిల్లా పశ్చిమ కనుమల్లో కొంతభాగంగా దక్కన్ పీఠభూమి దక్షిణ కొనపై ఉంది. 

సహ్యాద్రిగా పిలవబడే పశ్చిమ కనుమలు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలకు విస్తరించి ఉన్నాయి. కేరళలోని వయనాడ్తోపాటుగా, మలప్పురం, కోజికోడ్, కాసర్ గోడ్, కన్నూరు జిల్లాలు కూడా ప్రకృతి బీభత్సానికి అతలాకుతలమైపోయాయి. ముఖ్యంగా వయనాడ్ జిల్లాలో సంభవించిన ప్రకృతి విధ్వంసం మాటల్లో వర్ణించలేం. అర్ధరాత్రి సుమారు 200 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వయనాడ్ ప్రజలకు గత జులై 29వ తేదీ అర్ధరాత్రి ఒక కాళరాత్రిలా మిగిలింది. తెల్లారేసరికి ఎన్నో బతుకులు తెలగిపోయాయి. భవనాలు, పూరిగుడిసెలు, ತನುವಿದ್ದು ಆರ್ ಪರಮಿಸಿ ಅಪ್ಪಿ నేలమట్టమైపోయాయి. విపరీతమైన వర్షాలకు కొండచరియలు విరిగిపడి జానావాసాలపై పడ్డాయి. కొండలు, ఎర్రమట్టి దిబ్బలన్నీ కరిగిపోయి ప్రజలు బురదలోనే సజీవసమాధి అయిపోయారు. ఇళ్లు బురదలో దిగబడ్డాయి. వందలాది ప్రాణాలు పోగా, కొన ఊపిరితో ఉన్న ప్రజలు బురదలో దిగబడిపోయి, సాయం కోసం చేతులు పైకెత్తి ఆర్థిస్తున్న దృశ్యాలు అత్యంత హృదయవిధాకరంగా ఉన్నాయి. వయనాడ్ జిల్లా కేరళరాష్ట్రంలో పశ్చిమ కనుమల్లో అతితక్కువ జనసాంద్రత గల జిల్లా. ఇది సుమారు 43 సంవత్సరాల క్రిందట ఏర్పడింది. భారతదేశంలో జనగణన జరగని కారణంగా ఇక్కడి జనసంఖ్యను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. ఇక్కడ సుమారు 9లక్షల జనాభాకుపైగా ఉండవచ్చునని అనధికార అంచనాలను బట్టి తెలుస్తున్నది. ఎత్తయిన కొండలు, లోయలు, అడవుల మధ్య వయనాడ్ జిల్లా ప్రకృతి సౌందర్యంతో విరాజిల్లుతున్నది. పచ్చదనానికి పెట్టింది పేరు వయనాడ్. ఇక్కడ కావేరీ నది, దాని ఉపనది కబినీ నది ప్రవహిస్తున్నాయి. 

ఇక్కడ వేసవికాలంలో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. పర్వతశ్రేణులతో, పచ్చదనపు సోయగంతో, వేసవిలో సైతం శీతల సమీరాలు వీచే ఈ అందమైన జిల్లా ఒక పర్యాటక ప్రాంతంగా, వేసవి విడిదిగా మారింది. మిగిలిన కాలాల్లో ఎంతో ఆహ్లాదానిచ్చే వయనాడ్ వర్షాకాలం సమీపించగానే వరదలకు బెంబేలెత్తిపోతున్నది. వయనాడ్లో కొన్నిసార్లు ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీకి చేరి నీరు గడ్డకట్టడం వంటి పరిస్థితులున్నాయని చెబుతారు. అయితే ఇది గత చరిత్రగా మిగిలిపోతున్నది. కాలాలను బట్టి ఇక్కడ పరిస్థితులు మారుతుంటాయి. వయనాడ్ను ఉష్ణమండల ద్వీపంగా పిలుస్తారు. పశ్చిమ కనుమల్లో పలు జలాశయాలతో, వన్యసంపదతో వ్యవసాయం, పర్యాటకం ప్రధాన ఆదాయ వనరుగా వయనాడ్ ప్రసిద్ధి చెందింది. పెద్దగా పరిశ్రమలు లేవు. అభివృద్ధి కూడా జరగలేదు. భారతదేశంలోని వెనుకబడిన జిల్లాల్లో వయనాడ్ ఒకటి, వయనాడ్ గిరిజన ప్రజల నివాసకేంద్రం. ఆదివాసీ సంస్కృతికి ఆలవాలమైన వయనాడ్లో సహజసిద్ధమైన జీవన విధానం ఏర్పడి ఉంది. గుడిసెల్లో, మట్టి ఇళ్లలో జీవిస్తూ.. ప్రకృతి ఒడిలో హాయిగా జీవించవలసిన వయనాడ్కు ఎందుకు ఈ దుర్గతిపట్టింది. ఇటీవలకాలంలో కేరళలో అనేక వాతావరణ మార్పులు జరుగుతున్నాయని, కొన్నిసార్లు వడగాడ్పులు వీస్తున్నాయని, గతంలో సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షం నమోదైనదని తెలుస్తున్నది. కేవలం అధికవర్షాల కారణంగానే వయనాడ్లో విధ్వంసం జరిగిందనడం సరికాదనే వాదన వినిపిస్తుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో రోజులు తరబడి వర్షాలు పడుతున్నా, జరగని ప్రాణనష్టం వయనాడ్లో ఎందుకు జరిగింది? భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, అరేబియా సముద్రజలాలు విపరీతంగా వేడెక్కడం వలన వాతావరణంలో అవంధనీయ మార్పులు చోటు చేసుకున్నాయని, ముఖ్యంగా గ్లోబర్ వార్డింగ్ వలన, అరేబియా సముద్రజలాలు వేడెక్కడం వంటి పరిణామాలే వయనాద్లో సంభవించిన ఆకస్మిక వరదలకు కారణమని పర్యావరణవేత్తల వ వయనాద్ ప్రకృతి విధ్వంసానికి గల కారణాలు? అని కెరళలోని భౌగోళిక పరిస్థితుల వటనే ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని, ఆకస్మిక వర్షాలు, వరదల వలన జననష్టం జరుగుతున్నది పలువురు పర్యావరణ నిపుణులు అంటున్నారు. 

ఇటీవల కాలంలో కేరళలో అసాధారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతు న్నాయని చెబుతున్నారు. కేరళలోని వయనాడ్తో సహా పలు చోట్ల వ్యవసాయ అవసరాల నిమిత్తం అడవులను విచక్షణారహితంగా నరికి వేయడం జరిగింది. ఒకప్పుడు తక్కువ జనసాంద్రత గల ప్రాంతాలు అభివృద్ధి పేరిట. జనావాసాలు విస్తరిం చాయి. బలహీనమైన కొండల చెంత స్వార్థ చింతనతో, లాభాపేక్షతో చేసే కార్యకలాపాల వలన ప్రకృతి విధ్వంసం జరిగింది. అడవులు అంతరించిపో యాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. గ్లోబల్ వార్మింగ్ కేరళ భూతలాన్ని, అరేబియా సముద్ర జలాలను వేడెక్కించింది. బురద పెల్లుబుకి ప్రవహించి, ఆ బురదలో ఎన్నో ఇళ్లు కూరుకుపోయాయి. ఎన్నో ప్రాణాలు ఎర్రమట్టి బురదలో సజీవ సమాధి కాబడ్డాయి. ఇలాంటి పరిస్థితులను ముందుగానే ఊహించి 2011వ సంవత్సరంలో గాద్గిల్ కమిటీ పశ్చిమ కనుమలకు సంబంధించి, అక్కడి పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి సంరక్షణ కోసం చేపట్టవలసిన చర్యల గురించి అనేక సూచనలు చేసింది. హిల్ స్టేషన్లకు అనుమతులివ్వవద్దని, ఎకనామిక్ జోన్ల ఏర్పాటును నిరాకరించాలని, ప్లాస్టిక్ను నిషేధించాలని, ఇసుక తవ్వకాలను ఆపాలని గాడ్డిల్ ప్యానల్ సూచించింది. మాధవ ధనుంజయ గాల్ భారతీయ మేధావి, పర్యావరణ శాస్త్రవేత్త. ఇతను పర్యావరణ పరిరక్షణ కోసం పలు సిఫార్సులు సూచించాడు.. ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో పర్యావరణ విధ్వంసం జరగకుండా కొన్ని సూచనలు చేసాడు. భారతదేశంలో సుమారు 160000 చ.కి. విస్తీర్ణంలో విస్తరించిన పర్వత శ్రేణులే పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలను యునోస్కో వారసత్వ సంపదగా ప్రకటించింది. 

బయోడైవర్సిటీకి నిలయంగా పశ్చిమ కనుమలను గుర్తించడం జరిగింది. గాద్గిల్ సూచనలు అభివృద్ధికి విఘాతంలా భావించి పలువురు ప్రతిఘటించడంతో ఈ సిఫార్సులు కార్యరూపం దాల్చలేదు. దీని కారణంగా నిబంధనలకు విరుద్ధంగా, లోపాయికారీ ఒప్పందాలతో అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం జరిగింది. ప్రకృతి తన ప్రభావం చవిచూపించింది. తత్ఫలితంగానే వయనాడ్లో భయంకరమైన ప్రకృతి ప్రళయం సంభవించింది. వందలాది మంది ప్రజల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిద్రలోనే ఆగిపోయాయి. సైన్యం ఎన్.డి.ఆర్. ఎఫ్ బృందాలు, బాధితులకు అండగా నిలబడ్డాయి. 2018 మరదలతో కకావికలమైంది. వాటి ప్రకృతి వైపరీత్యానికి సుమారు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులైనారు. వయనాడ్ వంటి కొన్ని జిల్లా నేలల్లో పటుత్వం తగ్గి, త్వరిగతిన కుదించబడుతున్నాయి. వీటిని బ్రజ్ సాయిల్స్ అంటారు. నేల స్వభావం అధిక ప్రాణ నష్టానికి కారణమని చెప్పక తప్పడు. దీనికితోడు మానవ దుశ్చర్యలు తోడె మరలు నుంటికలు మోగిస్తున్నాయి. పశ్చిమ కనుమలను నాశనం చేయడం వ్యాపారాల పేరుతో ప్రకృతిని విధ్వంసం చేయడం, పెద్దపెద్ద భవంతులను నిర్మించడం, క్వారీల పేరుతో, గనుల తవ్వకాల పేరుతో అత్యంత సున్నితమైన స్వభావంగల నేల వరదలకు బురదగా మారడం జరిగింది. కొండలు బలహీనంగా తయారైనాయి. గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. 

లక్షలాది మంది ప్రజల జీవితాలకు భద్రత లేకుండా పోయింది. కొండల్లో, కోనల్లో, అడవుల్లో స్వలాభం కోసం సాగిస్తున్న ప్రకృతి విధ్వంస రచన ఆగాలి. కేరళలోని వయనాడ్తో సహా ఇతర జిల్లాల్లో భౌగోళిక స్వరూపాన్నిబట్టి, నేల ్వభావాన్ని గుర్తించి భారీ వర్షాల నుండి. వరదల నుండి ప్రజలను కాపాడాలి. ప్రకృతి విలయాలకు అందమైన పశ్చిమ కనుమలు నిలయం కారాదు. కొండ చరియలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రజల నివాసాలకు, వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు అనుమతిన్వి రాదు, కొండ చరియలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రజల నివాసాలకు, వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు అనుమతినివ్వరాదు. సురక్షితమైన ప్రాంతాల్లోనే ప్రజలకు నివాసాలు ఏర్పాటు చేయాలి. గార్గిల్ కమిటీ సిఫార్సులను అమలుచేసి ప్రకృతి విలయతాండవం నుంచి వయనాడ్ వంటి ప్రాంతాలను కాపాడాలి. వయనాద్లో మటుమాయమవుతున్న పచ్చదనాన్ని కాపాడాలి, గాడ్స్ ఓన్ కంట్రీగా పేరొందిన సహజసిద్ధమైన ప్రకృతి సంపద గల కేరళను ప్రమాద రహితంగా, పర్యావరణానికి నష్టం కలిగించకుండా, అందమైన పర్యాటక రంగంగా, ప్రకృతి విధ్వంసానికి తావు లేని విధంగా అభివృద్ధికి ఆలవాలంగా తీర్చిదిద్దాలి. వయనాడ్లోని కొండచరియలు విరిగిపడిన పశ్చిమ కనుమల్లని 13 గ్రామాలను సున్నితమైన పర్యావరణ ప్రాంతం(ఎకోలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా)గా ప్రకటించేందుకు ఇటీవల కేంద్రం ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇలాంటి సున్నితమైన ప్రాంతాన్ని ప్రకృతి వైపరీత్యాల బారి నుండి కాపాడాలి. ఇడుక్కి పలక్కాడ్, వయనాడ్ వంటి కొండ ప్రాంతాలు ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా పేరు గాంచాయి. 

పర్యాకులకు ఇబ్బంది లేని విధంగా ఈ ప్రాంతాలను పరిరక్షించాలి. కేవలం కేరళలోనే కాదు దేశంలోని పలు రాష్ట్రాల్లో గతంలో అనేకమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. నేటికీ ప్రకృతి ప్రళయాలు ప్రజలను పలకరిస్తూనే ఉన్నాయి. ఇటీవల దేవభూమిగా పిలవబడుతున్న ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిసి వరదలు సంభవించి, కొండచరియలు వరదలు సంభవించాయి. గత సంవత్సరంకూడా ఉత్తరాఖండ్ కారీ వర్షాలకు, వరదలకు ఎన్నో భవనాలు కుప్పకూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ చమోలీ, త, డెహ్రాడూన్ తదితర చోట్ల వరద ప్రభావం అధికంగా ఉంది. వరదల వలన అనేకమంది చనిపోతున్నారు. పర్యాటకులు, తీర్థయాత్రలకు వచ్చేవారు వరదల వలన అనేక కష్టాలు పడడం చూస్తున్నాం. కేదార్నాల్లో పలువురు ప్రయాణికులు చిక్కుకుపోతున్నారు. నిత్యావసర సరుకులను బాధితులకు చేరవేయడానికి తీవ్ర కృషి జరుగుతున్నది. కుండపోత వర్షానికి ఇళ్లు మునిగిపోతున్నాయి. వరదల వలన రహదారులు, వంతెనలు కొట్టుకుపోతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసాయి. పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. గతంలో మాదిరిగా భారీ ప్రాణ నష్టం జరగకపోవడం కొంత ఊరట కలిగించింది. డెహ్రాడూన్, హరిద్వార్ ఆపంతాల్ల రహదారులన్నీ జలమయమై పెద్ద చెరువులను తలపిస్తున్నాయి. 

ఇళ్లలోకి నీరుకుంది. ఉత్తరాఖండ్ వరదలకు కారణాలు- పరిష్కార మార్గాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదిర ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నా ఉత్తరాఖండ్లో ప్రాణనష్టం అధికంగా ఉండడానికి, వరద ఉధృతికి గల కారణాలను తెలుసుకోవాలి. నదుల్లో వ్యర్థాలు పేరుకుపోవడం, నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం వలన ప్రవాహ గతి తప్పి జనావాసాలకు ముంపు ముప్పు ఏర్పడుతున్న ది. హిమాలయ పాదాల వద్ద విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టడం అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బార్లా గేట్లు తెరవడం వలన పర్యావరణానికి హాని కలుగుతున్నదని, దీనివలన ఉత్తరాఖండ్లో ప్రకృతి వైపరీత్యా లు సంభవిస్తున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. అడ్డదిడ్డంగా, అక్రమంగా వెలుస్తున్న కట్టడాల వలన నీటి సహజ ప్రవాహానికి ఆటంకం ఏర్పడి గ్రామాలను, జనావాసాలను ముంచెత్తుతున్నా యని, మానవ తప్పిదాలే ఉత్తరాఖండ్ ప్రకృతి విలయానికి కారణమని తెలుస్తున్నది. దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు కేవలం కేరళ వంటి రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలు, పట్టణాలు నీట మునుగుతున్నాయి. అపార ప్రాణనష్టం సంభవిస్తున్నది. అనేకమంది ప్రజలు నిరాశ్రయులవుతు న్నారు. కేదార్నాథలో యాత్రికులు చిక్కుకుపోతున్నారు. హిమాచలప్రదేశ్ లోకూడా వరదలు వణికిస్తున్నాయి. మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలకు వరదలకు అనేక మంది తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నాయి. పూనే, ముంబై, రాయగఢ్, సిందుదుర్గ్, నాసిక్ట్ తదితర చోట్ల భారీ వర్షాలకు జన జీవనం స్తంభించిపోతున్నది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870