తెలంగాణ (TG) లోని, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట (M) గొల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చికెన్ ముక్క గొంతుల్లో ఇరుక్కొని ఆటో డ్రైవర్ మృతి చెందాడు.. ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడికి భార్య కవిత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. (TG) గొల్లపల్లిలోని కేసీఆర్ డబుల్‌బెడ్రూం కాలనీకి చెందిన పాటి సురేందర్(45) ట్రాలీ ఆటో న డుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
Read Also: Kaleshwaram project: రంగనాయకసాగర్ లోని నీళ్లు కాళేశ్వరం జలాలని నిరూపిస్తావా?

ఊపిరాడక మృతి
ఆదివారం కావడంతో ఇంట్లో చికెన్ వండుకున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంటిల్లిపాది కలిసి కూర్చుని తింటూ ఉండగా, సురేందర్ కు చికెన్ ముక్క గొంతులో ఇరుకుపోయింది. దీంతో అతడు శ్వాస ఆడక చాలా సేపు ఇబ్బందిపడి,ఊపిరాడక మృతి చెందాడు. సురేందర్ మృతితో అతని, బిడ్డలు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: