సమంత, రాజ్ నిడిమోరుల వివాహం ఇటీవలే ఘనంగా జరిగింది. వీరి పెళ్లి ఈషా ఆశ్రమంలో చాలా సింపుల్ గా అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఆ సన్నిహితులతో రాజ్ తల్లి రమాదేవి సోదరి, పద్మశ్రీ అన్నమయ్య పదకోకిల డా. శోభారాజు (Dr. Shobha Raju) హాజరయ్యింది. ఇక మొదటిసారి రాజ్ – సమంత పెళ్లి తరువాత శోభారాజు పలు విషయాలు వెల్లడించారు. సామ్ (Samantha) తో ఉన్న మునుపటి అనుబంధాన్ని, రాజ్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
Read Also: Sairat Movie: ఇండియన్ బాక్సాఫీస్‌ను కుదిపేసిన ‘సైరాట్’ సక్సెస్ స్టోరీ
ఒకే రకమైన క్రమశిక్షణ పాటించడం మంచి విషయం
“రాజ్ మా అక్క కుమారుడు. చిన్నప్పుడే డివోషనల్ పాటలు పాడేవాడు. అతనిపై నాకు అపారమైన ప్రేమ,” అని చెప్పిన శోభారాజు, సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. “ఆహారం విషయంలో సామ్ చాలా క్రమశిక్షణతో ఉంటుంది. మూడు నెలలకోసారి ఈశా యోగా కేంద్రానికి వెళ్లి ధ్యానం చేస్తుందని విన్నాను… తర్వాత నిజమే అని తెలిసింది.

ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది. ఆమె ఇచ్చే డైట్ సలహాలు పాటించాలంటే భయమేసేది,” అని చిరునవ్వుతో గుర్తుచేసుకున్నారు. సామ్ ఆధ్యాత్మికత, ధ్యానం, ఫిట్‌నెస్ పట్ల ఉన్న నిబద్ధత రాజ్‌కు కూడా ఉందని, ఇద్దరూ ఆహారం, వ్యాయామం, మెడిటేషన్ విషయంలో ఒకే రకమైన క్రమశిక్షణ పాటించడం మంచి విషయం అని తెలిపారు.
శోభారాజు ఎవరు?
శోభారాజు ప్రముఖ గాయకురాలు. ముఖ్యంగా డివోషనల్ పాటలు, జానపద పాటలు పాడారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: