భారత్‌పై దాడులు జరిపేందుకు పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు( Pakistan TerrorGroups) కొత్తగా పెద్ద కుట్ర పన్ని ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి అత్యంత ప్రమాదకర ఆర్గనైజేషన్‌ల కీలక కమాండర్లు రహస్య సమావేశం నిర్వహించినట్లు భద్రతా సంస్థలకు సమాచారమందింది. దీంతో దేశవ్యాప్తంగా అలర్ట్ జారీ చేశారు.
Read Also: Canada Earthquake: కెనడా–అలాస్కా సరిహద్దులో 7.0 తీవ్రతతో భూకంపం

లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ఇటీవల పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో నిర్వహించిన “సీరత్-ఎ-నబీ సహీహ్ బుఖారీ” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది జైష్ చీఫ్ మసూద్ అజార్ ప్రధాన స్థావరంగా గుర్తించబడిన ప్రదేశం. కసూరి తరచుగా అక్కడికి వెళ్లిపోయే విషయాన్ని నిఘా వర్గాలు గుర్తిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మహిళా జిహాదీలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
భారత్‌పై కొత్త కుట్ర?
కసూరి–మసూద్(Kasuri–Masood) అజార్ భేటీ భారత్‌కు వ్యతిరేకంగా వ్యూహాత్మక దాడులపై( Pakistan TerrorGroups) చర్చించేందుకు జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గామ్ దాడికి ముందు కూడా ఇదే ప్రాంతంలో కసూరి కనిపించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. రెండు ప్రధాన ఉగ్రవాద సంస్థల అగ్రస్థాయి నేతలు ఒకేచోట సమావేశమైన విషయం భారత భద్రతా వ్యవస్థకు గంభీర సంకేతంగా భావిస్తున్నారు. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని నిఘా అధికారులు సూచిస్తున్నారు.
మహిళా జిహాదీల నియామకాల్లో వేగం
జైషే మహ్మద్ ఇప్పుడు మహిళలను కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించే దిశగా అడుగులు వేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల కేసులో మహిళా ఉగ్రవాది లింకులు బయటపడటం దీని నేపథ్యంలో చూడాల్సి ఉంది. జైష్‌కు సంబంధించిన మహిళా విభాగం ‘జమాత్ ఉల్ మోమినాత్’లో కేవలం కొన్ని వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలను చేర్చుకున్నట్లు మసూద్ అజార్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. బహవల్పూర్, ముల్తాన్, కరాచీ, సియాల్‌కోట్, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల నుండి ఈ నియామకాలు నిర్వహించారు.
ఇందులో చేరిన మహిళలకు ఆన్‌లైన్ జిహాద్ కోర్సులు, 40 నిమిషాల శిక్షణ క్లాసులు అందిస్తున్నారు. ఒక్కో సభ్యురాలు 500 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఐఎస్‌ఐఎస్, హమాస్, ఎల్‌టీటీఈ తరహాలో ఫిదాయిన్ దాడులకు మహిళా దళాలను సిద్ధం చేయడం ఈ ప్రయత్నం వెనుక అసలు ఉద్దేశమని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: