हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Goa: గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

Aanusha
Latest News: Goa: గోవాలో అగ్నిప్రమాదం..  23 మంది మృతి

గోవా (Goa) లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నార్త్ గోవా (Goa) లోని ఒక నైట్ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది క్లబ్‌లోని కిచెన్ సిబ్బంది ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మరణించిన 23 మందిలో నలుగురు పర్యాటకులు ఉన్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. ముగ్గురు వ్యక్తులు మంటల్లో సజీవదహనం కాగా, 20 మంది పొగకు ఊపిరాడక చనిపోయారని పోలీసులు వెల్లడించారు.

Read Also: ibomma-case: iBOMMA కేసులో మరో పెద్ద ట్విస్ట్

Fire in Goa.. 23 people death
Fire in Goa.. 23 people death

ఘటనపై ఉన్నతస్థాయి విచారణ

ప్రమాద వార్త తెలియగానే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ దుర్ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు. క్లబ్‌లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమికంగా తెలిసిందని, విచారణలో నిర్లక్ష్యం బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.ఈ ప్రాంతంలోని అన్ని నైట్‌క్లబ్‌లలో తనిఖీలు చేపడతామని, అనుమతులు లేని వాటి లైసెన్సులు రద్దు చేస్తామని ఎమ్మెల్యే మైఖేల్ లోబో తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతేడాది ప్రారంభమైన ఈ క్లబ్‌లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం స్థానికంగా కలకలం రేపింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870