మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం వైజాగ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో సమష్టిగా రాణించిన టీమిండియా 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన బవుమా (Temba Bavuma).. భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చిందని కొనియాడాడు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు తమ పతనాన్ని శాసించారని తెలిపాడు.
Read Also: Shubman Gill: గాయం నుంచి పూర్తిగా కోలుకున్న గిల్
పరిస్థితులు కూడా భిన్నంగా ఉన్నాయి
‘ఈ రోజు కూడా మేం మ్యాచ్‌ను ఉత్సాహంగా మార్చాలనుకున్నాం. బ్యాటింగ్‌లో మేం సరైన లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాం. ఫ్లడ్ లైట్స్ కింద బ్యాటింగ్ చేయడం సులువు అవుతుంది. మేం అనవసర షాట్లతో వికెట్లు పారేసుకున్నాం. కాస్త తెలివిగా బ్యాటింగ్ చేయాల్సింది. భారత జట్టు తమ సత్తా ఏంటో చూపించింది. వారికి నా అభినందనలు.

మేం కాస్త తెలివిగా ఆడాల్సింది. తొలి రెండు వన్డేల్లో మేం అద్భుతమైన ప్రదర్శన చేశాం.కానీ ఈ రోజు రాణించలేకపోయాం. పరిస్థితులు కూడా భిన్నంగా ఉన్నాయి. వన్డేల్లో ఆలౌట్ అవ్వాలని ఎవరూ కోరుకోరు. మాకు మంచి ఆరంభాలు లభించాయి. క్వింటన్ డికాక్ సెంచరీతో రాణిస్తే.. నేను కూడా బాగా ఆడి ఔటయ్యాను. ఈ సిరీస్ కోల్పోయినా మా ప్రదర్శన చాలా మెరుగైంది.
భారత్‌కు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వారిపై ఒత్తిడి తీసుకురావడం అంత సులువు కాదు. ఈ సిరీస్‌లో చాలా వరకు మేం మెరుగైన ప్రదర్శనే చేశాం. పది బాక్స్‌లు ఉంటే.. వాటిలో 6 -7 బాక్స్‌లు టిక్ చేశాం.’అని బవుమా (Temba Bavuma) చెప్పుకొచ్చాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: