andhra pradesh politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టి, ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS sharmila) తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాలపై మాట్లాడాల్సిన సమయంలో కూడా రాష్ట్ర ఎంపీలు మౌనం పాటిస్తూ, బీజేపీ(Bharatiya Janata Party) వంతు పనిచేస్తున్నారని ఆమె ఘాటుగా ఆరోపించారు. శీతాకాల సమావేశాల సమయంలో ఎంపీల ప్రవర్తన పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Ramanarayana Reddy: పాలు లేకుండా నెయ్యి తయారీ?
ఎంపీల వైఖరిపై షర్మిల
“రాష్ట్ర విభజన జరిగి పదకొండు సంవత్సరాలు గడిచినా, అప్పటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. అయినా మన ఎంపీలు బాధ్యతను గుర్తు చేసుకోకుండా, మోదీ ప్రసంగాలకు చప్పట్లు కొట్టడంలోనే ముందున్నారు. రాష్ట్ర అభివృద్ధి (Development of the state) కంటే స్వప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పేరుకు వేర్వేరు పార్టీలకు చెందినవారైనా, పనితీరులో మాత్రం బీజేపీ రబ్బర్ స్టాంపుల్లా మారిపోయారు. బీజేపీ తెచ్చే ప్రతి బిల్లుకూ అంధంగా మద్దతు ఇస్తున్నారు” అని షర్మిల విమర్శించారు.

పోలవరం, అమరావతి సమస్యలపై మౌనం ఎందుకు?
విభజన హామీలను ప్రజలకు ఇచ్చిన చెక్కుతో పోలుస్తూ ఆమె అన్నారు: “2014 నాటికి విభజన హామీల విలువ సుమారు రూ.5 లక్షల కోట్లు. ఆ హామీలు మన చేతిలో ఉన్నా, వాటిని అమలు చేయించుకోలేని పరిస్థితి ఉంది. పోలవరం ఎత్తును 41 మీటర్లకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పినా, అమరావతికి సహాయం లేదని పార్లమెంటరీ కమిటీ స్పష్టంచేసినా, మన ఎంపీలు స్పందించకుండా నిశ్శబ్దంగా కూర్చున్నారు.”
ప్రజల కోసం మాట్లాడండి… మోదీ కోసం కాదు
అలాగే, “రాష్ట్రానికి 25 మంది లోక్‌సభ, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. నిజంగా మీరు తెలుగు ప్రజల ప్రతినిధులైతే, మీలో తెలుగోడు రక్తం ప్రవహిస్తే, ప్రజలు మీపై ఉంచిన విశ్వాసాన్ని గౌరవిస్తే, ఇప్పటికైనా విభజన హామీలపై పార్లమెంట్‌లో బహిరంగంగా మాట్లాడండి. ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశ్నించండి” అని షర్మిల(YS sharmila) కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: