బీహార్లోని (Bihar) బోధ్ గయలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక వివాహ వేడుకలో రసగుల్లా (Rasgulla) పంపిణీకి సంబంధించిన గొడవ చివరికి పెళ్లి రద్దుకు దారితీసింది. గత నెల 29న బక్రౌర్ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ వివాహం జరుగుతున్న సమయంలో ఈ ఉద్రిక్తత తలెత్తింది.
Read Also: Central government : ఇండిగో సీఈవో పదవికే ముప్పు

పెళ్లి వేడుకలో భాగంగా పసందైన వంటకాలను వడ్డిస్తుండగా, రసగుల్లాలు తక్కువయ్యాయంటూ వధువు కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ చిన్న అంశంపైనే ఇరు కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా తీవ్రమై, బంధువులు ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకుంటూ దారుణంగా కొట్టుకున్నారు. ఈ పరస్పర ఘర్షణలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివాహం రద్దు, వరకట్న కేసు నమోదు
పరిస్థితి చేయిదాటిపోవడంతో, ఈ ఘటనతో వధువు తండ్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫంక్షన్ హాల్లోనే వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, స్థానిక పోలీస్ స్టేషన్లో వరుడి కుటుంబంపై వరకట్నం (Dowry) కేసు కూడా పెట్టారు. రసగుల్లా పంపిణీతో మొదలైన చిన్న గొడవ చివరకు పెళ్లి ఆగిపోవడానికి మరియు న్యాయపరమైన చర్యలకు దారితీయడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: