हिन्दी | Epaper
చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం

The Caste of Soil : మట్టికులం

Abhinav
The Caste of Soil : మట్టికులం

చబ్లినాయన్ తన అరుగు మీద ఓ బండ పెట్టుకుంది. దాని మీద కూర్చొని గిన్నెలు కడుగుకునేది, కంచాలు తోముకునేది. బట్టలు కూడా ఉతుక్కునేది. కాళ్ల మడమలు కూడా ఆ బండపై రుద్దుకునేది. కూరగాయలు కోస్తున్నప్పుడు కత్తి పదునుగా లేనట్టు అనిపించినప్పుడు ఆ బండ మీద రాసి పదును పెట్టేది. తన అరుగు మీదున్న బండలాగే చబ్లి తన గుండెలో అవ్యక్తమైన బాధను దాచుకుంది. సంవత్సరాల తరబడి తన జీవితంలోని ఎంగిలి దినాలను తోముకోసాగింది. మైలపడ్డ శ్వాసలను శుభ్రపరచుకోసాగింది. పగుళ్లు పడ్డ ప్రేమ మడమలను బండ మీద రుద్దుకునేది. తన పెండ్లి మొండి కత్తిని బాగా రుద్ది పదును చేసుకొంటుండేది. ఆ ఊరి జనాభిప్రాయం ప్రకారం చబ్లి రాంలీల నాటకం ఆడేవాడితో ప్రేమలో పడింది. అతడు నెలలకొద్ది ఏ సీతకో రాముడయ్యేవాడు. ఏ దమయంతికో నలగా ఉండేవాడు. లేదా ఏ కోకిలకో రసాలుగా అయ్యేవాడు. కానీ కొన్ని నిమిషాల కోసం చబ్లికి ఏమీ కాలేకపోయాడు. ఎందుకంటే ‘సీతారాం’ నాటకం తర్వాత ‘నల దమయంతీ’ నాటకం ఆడవచ్చు. ‘కోకిల రసాలు’ నాటకం ఆడవచ్చు. 

క్లుప్తంగా చెప్పాలంటే ఏ నాటకమైనా ఆడొచ్చు, నాటకాన్ని చూడడానికొచ్చే ప్రేక్షకులకు చాలా ఆనందంగా ఉంటుంది. తమాషాగా ఉంటుంది. వాళ్లు ఓ స్త్రీ, పురుషుడి తమాషాను తిలకిస్తారు. గట్టిగా చప్పట్లు కొడతారు. ఆ తర్వాత ఆ నాటకంలోని ముఖ్య పాత్రధారులను అక్కడే నాటక స్థలంలో వదిలేసి తమ తమ ఇంటికి వచ్చేస్తారు. నాటకంలోని రెండు ముఖ్య పాత్రధారులు జీవితాంతం ఆ పాత్రలనే ధరిస్తుంటారు. చబ్లి తన పెండ్లి నాటకం ఆడడానికి తహతహలాడసాగింది. అతడు రాంలీల ఆడేవాడు. జీవితపు నాటకంలో ఓడిపోయి, సాధువు అయిపోయాడు. చబ్లి ఎన్నాళ్లనుంచో తన సాధువు తిరిగొస్తాడని ఎదురు చూడసాగింది. కపోతాలను ఎగిరేయసాగింది (కవ్వే ఉడాన). ఆ నిరీక్షణలోనే చబ్లి జుట్టు రంగు కూడా ఎగిరిపోయింది. ఇప్పటికీ తన సాధువు తిరిగొస్తాడన్న నమ్మకం ఉంది. ఇప్పుడు తన తలజుట్టుకు ఎర్ర గోరింటాకు రంగు పట్టించసాగింది. ఊరిలోని పెండ్లిదొచ్చిన అమ్మాయిల చేతులకు గోరింటాకు వేసిది. ముఖ్యంగా వారి పెండ్లి నిశ్చితార్థంలో- ప్రతిరోగ తన కండ్లకు కాటుక పెట్టుకునేది. కొద్దిసేపటి తర్వాత తన కండ్ల నీటి వల్ల కాటుక తడిసిపోగా తన చీర కొంగుతో తుడుచుకునేది.

తన జీవితం ఊరిలోని అమ్మాయిలు, అబ్బాయిల పెండ్లి సంబంధాలు చూసి పెట్టేది. కానీ తన అనుభవానుసారం ప్రతి మొగజాతి కేవలం అలంకరణ, అబద్ధాల పుట్టగా గుర్తించింది. మంచి బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయికి ఖత్రి అబ్బాయితో వివాహం జరిగితే వారికి పుట్టే – సంతానం అంగవికలాంగుడిగా పుడతాడట! కాలక్రమేణ చబ్లికి మొగజాతిపై విశ్వాసం సన్నగిల్లింది. ఆమె మనసులో నేల.. మట్టిపై విశ్వాసం ప్రగాఢంగా – మారింది. వాస్తవంలో నమ్మకమైన – కులం జాతి, కేవలం మట్టిజాతి. – చల్లినాయన్ ఏ అమ్మాయికైతే ఒంటికి – పసుపు రాస్తూందో, ఏ అమ్మాయికైతే నూనెతో శరీర మర్దనం చేస్తూందో ఏ అమ్మాయికైతే కేశాలు సవరిస్తూందో ఆ సమయాలలో ఇలాగే ఆలోచిస్తుండేది. రేగడిమట్టి, ఇసుకమట్టి, కంకరమట్టి, ఎర్రమట్టి, పసుపురంగు మట్టి.. మట్టికి కూడా ఎన్ని జాతులు! ‘ కానీ ఏ మట్టిలో పత్తి పండుతుందో అది వేరే మట్టిలో పండదు. ఏ మట్టిలో ద్రాక్ష పండ్లోస్తాయో మరేమట్టిలో రావు-నిజంగా ఈ జాతులు ఎంత నిజమైనవి.. సత్యమైనవి!! ఏ రోజైతే ఆ ఊరిలోని బత్రీయులు అమ్మాయి. బాలు జాట్ అబ్బాయి నందాతో ప్రేములో గింజుకొంటున్నప్పుడు చల్లి ఆలోచనలన్నీ పటాపంచలైపోయాయి. 

ఈ మాట ఆ నోట ఈ నోట ఊరంతా పాకిపోయింది. బాలు తండ్రి పక్క ఊరిలో తన ఖత్రీ కులానికి చెందిన అబ్బాయితో పెండ్లి సంబంధం ఖాయం చేశాడు. ఊరివాళ్ల నోరు మూతపడింది. చబ్లినాయన్ కొన్ని నిమిషాలలో బాలు చేతులకి పెండ్లి గోరింటాకు డిజైన్ వేయడానికి వెళ్లనున్నది. నంద పొలం చబ్లి ఇంటివెనుక వైపునే ఉన్నది. చల్లి తన ఇంటి వెనుక వైపున్న గోడకు పేడ అలుకుతుండగా మొక్కజొన్న తోటలో నుంచి ప్రేమ జంటల గుసగుసలు వింది. చబ్లి ఉనికిని గమనించి బాలునంద అక్కణ్నుంచి ఉడాయించేవాళ్లు. ఇలా ఎన్నో సార్లు వీళ్లిద్దరిని చూసి తనలో తనే నవ్వుకునేది. ప్రేమగువ్వలనుకునేది… ఆలోచించుకునేది.. స్వర్ణకారుడు బంగారంలో రాగితో కల్తీ చేస్తాడు. లోకం పట్టించుకోదు. అదే ఇద్దరు ప్రేమకులు తమ స్వర్ణ ప్రేమ గుండెలో ప్రేమ స్వర్ణం కలిపితే లోకం ఆకాశాన్ని తమ తలలపై పెట్టుకొంటారు. వారిద్దరికి సమాజం శత్రువైపోతోంది. పెండ్లింటివాళ్ల దగ్గర్నుంచి రెండవసారి పిలుపు వచ్చింది. చబ్లి ఇంట్లోంచి బయటికొచ్చి తాళం వేసింది. తన ఆలోచనలకు కూడా. 

బయట చల్లగాలి వీస్తోంది. చల్లి తన నుదుటిపై పడిన ఎర్ర రంగు కేశాలను సవరించి, తలపై కొంగు పెట్టుకుంది నడిచిందో లేదో మరోసారి గట్టిగా వీచిక గాలికి తన పైట జారి జుట్టు చిందర వందరగా నుదుటపై పడింది. చల్లి మనసులో చిన్న ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం కోసం పాపం..! అతడు ఏ అవస్థలో ఉన్నాడోననుకుంది. ఆమె నంద పొలాల వైపు వెళ్లింది. మోటబావిలో నుంచి నీళ్లు వస్తున్నాయి. మోటర్ నడుస్తోంది. నంద అక్కడ కనిపించలేదు. కానీ అతని మిత్రుడొకడు. కనిపించాడు. అతడు మోటబావిలో నుంచి వస్తున్న శబ్దానికి అనుకూలంగా లయబద్ధంగా పాట పాడుతున్నాడు. ‘హేర్ చెప్పాడు/జోగి చెప్పింది అబద్ధం/ఎవరు అలిగిన ప్రియుడిని ఒప్పిస్తాడు?/తప్పిపోయిన, మరణించిన వారిని/ఎవరు కలుపుతారు?/లోకం కేవలం ఇచ్చేది సాంత్వనం..’ చబ్లి మనసు రోదించింది. నిజంగా మరణించినవాళ్లు, వీడిపోయినవాళ్ల ఒకేలా ఉంటారు. నంద తల దించి పొలంగట్ట చివర కూర్చొని ఉన్నాడు. అతని కండ్లలో నుంచి ప్రవహిస్తున్న నీళ్లు కింద పడుతూ పొలంలో ప్రవహిస్తూన్న నీళ్లలో కలుస్తున్నాయి. 

“ఈ నీళ్లు ఏ పొలాలకెళ్తాయో ఆ పొలాల్లోని వంటల నుంచి ఈ కన్నీళ్ల గుబాళింపు వస్తుంది” అని చల్లి మనసులో అనుకొంది. నంద చల్లి నాయన్ ను చూశాడు. మొహం మరల్చుకొన్నాడు. చల్లి తన నుదురుపై పడిన కేశాలను తలపై సవరించింది. పైట తలపై సర్దుకుంది నంద దగ్గర తనతో చెప్పడానికి ఎలాంటి సమాచారంగానీ ఫిర్యాదుగానీ, లేదని అర్ధం అయ్యింది. చల్లి పెండ్లి ఇంట్లో ప్రవేశించింది. ఆమె ఆలోచించసాగింది…. “మా వృత్తి కూడా వింతగానే ఉంటుంది. ఎవరికి మంచి జరగకపోయినా మాకు వాటితో ఎలాంటి సంబంధం ఉండదు. మా ఆచార వ్యవహారాలు పూర్తి చేసి మాకొచ్చే కానుకలను తీసుకొని వెళ్లిపోవడమే!” అని అలోచించసాగింది. చిన్న చిన్న అమ్మాయిలు గోరింటాకు ఉన్న పళ్లెం చుట్టూరా కూర్చొని ఉన్నారు. వాళ్లందరు చల్లి రాక కోసం ఎదురు చూడసాగారు. ఆమె వేసే గోరింటాకు ఊరిలో మరెవరికీ రాదు. అమ్మాయిలు చబ్లి వేసే గోరింటాకును ఇష్టపడతారు. “నాకు ముందు… నాకు ముందు” అంటూ చబ్లి రాకతో అరవడం మొదలెట్టారు. కానీ వారందరికీ తెలుసు… మూలన నక్కి కూర్చున్న అమ్మాయికే ముందు గోరింటాకు రాయబడుతుందనీ, ఆ తర్వాతనే ఇతరుల వంతు వస్తుందని. 

“ఎలా కులుకుతూ వచ్చిందో చూడు!!” ఓ మహిళ అంది. “అరే! ఈరోజు కాకపోతే మరెప్పుడు తన కులుకు చూపిస్తుంది?” మరో మహిళ ఎగతాళి “ఎప్పటి నుంచి పాపం అమ్మాయి కూర్చొని… కూర్చొని ఎండిపోతుంది. నీ అరచేతిలో గోరింటాకు కొంచమే పెట్టేది. నాగలి దున్నేది లేదుగా!” బాలు అమ్మ, పిన్ని ఒకే ఊపిరిలో చట్లపై విరుచుకుపడ్డారు. “.. .. ఈరోజు నాతో నాగలియే దున్నించుకుంటే బాగుండేది” అని మనసులో అనుకుంది. కానీ తను నోరు విప్పే ముందు బాలు మొహం వైపు చూసింది. కానీ తను నోరు విప్పేముందు బాలు మొహంవైపు చూసింది. ఆమె నోరు కూడా తన నోరులాగే మూసుకొని ఉంది. బాలు తల వంచుకొని కూర్చొని ఉంది. ఆమె చేతిలో చిన్న ఎండిపోయిన (గడ్డి) పరక ఉంది. దానితో తన రెండు కాళ్ల మధ్యన ఉన్న మట్టిని కి(కెల)లకసాగింది. మృదువైన తన చెంప బుగ్గల పైనుంచి జారుగుతున్న కన్నీళ్లు కెలికబడిన ఆ మట్టిలో పడి, ఇంకిపోతున్నాయి. చబ్లి బాలు చేతిలోని గడ్డిపరకను తీసుకొని దూరంగా పారేసింది. ఆమె రెండు తెల్లని చేతులను తన చేతుల్లోకి తీసుకొని, అరచేతులను విప్పి, గోరింటాకు పట్టించసాగింది. 

కొన్ని రోజుల్లోనే గోరింటాకు రంగు పేలిపోతుందని చబ్లికి తెలుసు. కానీ గడ్డిపరకతో కెలికబడిన మట్టిలో ఇంకిపోయిన ఆమె కన్నీళ్లు మాత్రం ఏ రోజైనా మంటలను రేపుతాయని అనుకొంది. దగ్గర్లో నిలబడిన మహిళలు వివాహ గీతాలు పాడసాగారు. నాన్న నా సందు-గొందులు ఇరికి అయిపోయినాయి. నా ముంగిలి ఇప్పుడు పరదేసమైంది! చబ్లి ఈరోజు తలపై వేసుకున్న పూల పైట తిరగబడి ఉంది. గమనించుకోలేదు. కానీ ఇక్కడి ప్రతి విషయాన్ని కూడా మరో విధంగా అర్థం చేసుకోసాగింది. అన్నీ బోల్తా పడ్డాయన్నట్లుగా అనిపించాయి ఆమెకు. చబ్లీ ఆలోచించసాగింది… “అమ్మాయిల అదృష్టం కూడా విచిత్రంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఇంటిదారి సందులు ఇరుకుగా అయిపోతాయి. అందులో నుంచి ప్రేమపరమైన మొహం కూడా దూరలేనంత ఇరుకుగా ఉంటుంది. కానీ (వరుడి) ఓ పెద్ద పెండ్లి ఊరేగింపు దాని గుండా ప్రవేశిస్తుంది. 

“ఖత్రీయులకు తమ కులం ఉంటుంది. జాట్ కులానికి చెందిన అబ్బాయి ఈ విషయాన్ని ఎందుకు విస్మరించాడో?” పెండ్లి ఊరేగింపు దగ్గరికి రాసాగింది. ఆడవాళ్ల అరుపులు, కేకలు పెద్దగా వినిపించసాగాయి. చాలా హడావుడిగా మారింది అక్కడి వాతావరణం. బాలు నంద ప్రేమకథను తన నోటి పండ్ల మధ్య నమలసాగింది. “… అయితే ఖత్రీయులకు తమ జాతి సంబంధం దొరికిపోయింది” చబ్లినాయన్ గట్టిగా ఓ ఊపిరి పీల్చింది. మనసులో అనుకోసాగింది. కానీ మట్టిజాతినెవరు చూడలేదు. ఓ బంజర్ గుర్రంపై కూర్చొని నున్నని మట్టిని వివాహమాడటానికి బయలుదేరి వచ్చాడు. బంజర్లపై పూల కిరీటం ధరించి వచ్చాడు. నున్నని మట్టి ఎర్ర దుస్తులేసుకొని పెండ్లి పల్లకిలో ఎక్కి కూర్చుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870