రైల్వే శాఖ తిరుపతి,(New Train) షిర్డీ మధ్య కొత్త రైలు సర్వీస్‌ను ప్రారంభించింది. వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు (17425/17426) డిసెంబర్ 14 నుంచి ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. ప్రారంభ రైలు సర్వీస్ డిసెంబర్ 9న తిరుపతి సాయినగర్ షిర్డీ (07425), డిసెంబర్ 10న షిర్డీ-తిరుపతి (07426) మధ్య నడపబడుతుంది. రైలు రూట్‌లో రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, గంగాఖేర్, పర్భాని, సేలు, జల్నా, శంభాజీనగర్, నాగర్ సోల్, మన్మడ్, కోపర్ గావ్ స్టేషన్లపై హాల్టింగ్ ఉంటుంది.
Read also: రోజును శక్తివంతంగా ప్రారంభించే పనీర్ బ్రేక్‌ఫాస్ట్

అదనపు ప్రత్యేక రైళ్లు చర్లపల్లి నుండి
ఇండిగో విమానాల(New Train) సమస్యల కారణంగా ముంబాయి, చెన్నై వంటి ప్రాంతాలకు రైళ్లను జోడించడం జరిగింది. చర్లపల్లి నుంచి తిరుపతి,(Tirupati) నర్సాపూర్ ప్రత్యేక రైళ్లు ఈ నెల 6 మరియు 26 తేదీలలో బయలుదేరతాయి. చర్లపల్లి-తిరుపతి రైలుకు మల్కాజిగిరి, కాచిగూడ, ఉమ్డానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, డోన్, గుత్తి, తాడిపర్తి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట్, రేణిగుంట స్టేషన్లలో, చర్లపల్లి-నర్సాపూర్ రైలుకు నల్లగొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: