ఇండిగో విమాన సర్వీసులు వరుసగా రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్వహణ సమస్యల కారణంగా వందల సంఖ్యలో విమానాలు రద్దు అవుతుండటంతో, దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని మరింత క్లిష్టం చేసిందేమంటే—రద్దు సమాచారం ముందుగానే ఇవ్వకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై సుప్రీం దృష్టి– అత్యవసర పిల్ దాఖలు

ట్రైన్ ప్రయాణికులకు సూపర్ గుడ్ న్యూస్
విమానాల రద్దుతో ఇబ్బంది పడుతున్న వారికి సహాయంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడిచే 37 ప్రీమియం రైళ్లు కు మొత్తం 116 అదనపు కోచ్‌లను(Extra Coaches) జోడించింది. ఇవి డిసెంబర్ 6 నుండి అందుబాటులో ఉన్నాయి. దక్షిణ రైల్వే జోన్ పరిధిలో నడిచే 18 రైళ్లకు అదనపు బోగీలను(Extra Coaches) జత చేశారు. ప్రయాణ డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో స్లీపర్ క్లాస్ మరియు చైర్ కార్ కోచ్‌లు పెంచారు.
ఇతర జోన్లలో పరిస్థితి
- ఉత్తర రైల్వే: 8 రైళ్లకు అదనపు బోగీలు
- పశ్చిమ రైల్వే: 4 రైళ్లలో 3AC, 2AC కోచ్‌లు
- ఈస్ట్ సెంట్రల్ రైల్వే: డిసెంబర్ 6–10 మధ్య 5 ట్రిప్పులలో 2AC కోచ్‌లు
- ఈస్ట్ కోస్ట్ రైల్వే: భువనేశ్వర్–న్యూఢిల్లీ రూట్‌లో అదనపు 2AC కోచ్‌లు జత
- గోరఖ్‌పూర్–ఆనంద్ విహార్ స్పెషల్: డిసెంబర్ 7, 9 తేదీల్లో 4 ట్రిప్పులు నిర్వహణ
విమానాల రద్దును ఆసరాగా తీసుకున్న ధరల దోపిడీ
ఇండిగో సమస్యతో ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచాయి. కొన్ని రూట్లలో ఒక్కరోజు ప్రయాణానికి టికెట్ ధరలు ₹1 లక్షకు పైగా వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో రైల్వే తీసుకున్న చర్యలు ప్రయాణికులకు భారీ ఉపశమనంగా మారాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: