విజయవాడ: AP దేశవ్యాప్తంగా వివిధ ఏకలవ్య గిరిజన ఆశ్రమ పాఠశాలల (EMRS) విద్యార్థిని, విద్యార్థుల సంస్కృతి మరియు సంప్రదాయాల సమ్మేళన వేదికైన ‘ఉద్భవ్-2025’ శుక్రవారం విజయవంతంగా ముగిసింది. చివరి రోజు విద్యార్థులకు మార్గదర్శనం చేసేందుకు నిర్వహించిన భారీ సభను గుంటూరు జిల్లా ఇన్‌చార్జీ మంత్రి కందుల దుర్గేష్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయులుతో కలిసి గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
Read Also: Shivraj Kumar: దుర్గమ్మ సేవలో కన్నడ హీరో శివరాజ్ కుమార్
అనంతరం మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలు ఉన్నప్పటికీ ‘మనమంతా ఒక్కటే’ నని ఈ ఉద్భవ్ ద్వారా గిరిజన బాలబాలికలు ఎలుగెత్తి చెప్పారని ప్రశంసించారు. ఆదివాసీలు ఏ రంగంలోనూ తక్కువ కాదని నిరూపించేలా ఎదగాలని ఆకాంక్షించారు. అల్లూరి సీతారామరాజు, బిర్సా మొండా లాంటి స్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు మరిన్ని నిర్వహిం చే దిశగా పెద్దపీట వేస్తామని ఆమె స్పష్టం చేశారు.

49 ఈవెంట్లలో 300 మందికి పైగా విద్యార్థులు పతకాలు
గిరిజన బిడ్డల్లో కళా నైపుణ్యాలను ప్రోత్సహించి వారిని ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు ఉద్భవ్-2025 సరైన వేదికని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు తరలివచ్చి ప్రతిభ చూపడం అసాధారణ విషయమన్నారు. అడవిలో పుట్టిపెరిగిన వారు సైతం అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో ఎన్నో అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు ఏపీ వేదికవుతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. గిరిజనులుగా గర్వపడాలని, గిరిజన సంప్రదాయాన్ని దశదిశలకు వ్యాపింపజేయాలని మంత్రి డోలా పిలుపునిచ్చారు.
సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. మల్లికార్జున నాయక్ మాట్లాడుతూ, మూడు రోజుల పాటు జరిగిన మొత్తం 49 ఈవెంట్లలో 300 మందికి పైగా EMRS విద్యార్థులు పతకాలు సాధించారని వెల్లడించారు. ఉద్భవ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రం అందించనట్లు స్పష్టం చేశారు. మొత్తం 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1558 మంది విద్యార్థులు ఉద్భవ్-2025లో పాల్గొన్నారని నెక్స్ట్ జాయింట్ కమిషనర్ బిపిన్ రాటూరు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: