విజయవాడ : ఆంధ్రప్రదేశ్(AP) వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) జనరల్ మేనేజర్ మల్లాది విజయ సూర్యకళను ప్రభుత్వం(Government) సస్పెండ్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సూర్యకళపై అనిశా అధికారులు నవంబరు 20న కేసు నమోదు చేశారు. 21న విశాఖ, విజయవాడ, హైదరాబాద్ లో ఉన్న సూర్యకళతో పాటు ఆమె కుటుంబీకుల నివాసాల్లో సోదాలు సాగాయి. వారి పేరిట 27 స్థిరాస్థులున్నట్లు, మొత్తం రూ.6 కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టినట్లు అనిశా అధికారులు గుర్తించారు.
Read also: ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

ఏపీఎండీసీ జీఎం విజయ సూర్యకళను అరెస్ట్ చేసి సస్పెండ్
అదే రోజు(AP) ఆమెను అరెస్ట్ చేసి విజయవాడ లోని ఎసిబి స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి డిసెంబరు 5 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా జ్యుడీషియల్ రిమాండ్లో ఉండటంతో ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబరు 21నుంచి సూర్యకళ సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని రెవిన్యూ (విజిలెన్స్) శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: