ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఆండ్రీ రస్సెల్ (Andre Russell) రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే… అయితే రస్సెల్‌ను విడుదల చేయడం, ఆ తర్వాత కోచింగ్ స్టాఫ్‌లో తీసుకోవడానికి పెద్ద కథే ఉందని కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ (Venky Mysore) తాజాగా ఓ పెద్ద వివరణే ఇచ్చాడు. రసెల్‌ను విడుదల చేయడం వెనుక ప్రధాన కారణం ఆర్థికపరమైన వ్యూహమేనని వెంకీ మైసూర్ స్పష్టం చేశారు.
Read Also: Rajasthan Royals: కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా: పరాగ్
రసెల్ కాంట్రాక్ట్ విలువ రూ. 12 కోట్లు అయినప్పటికీ, నిబంధనల ప్రకారం అతడిని అట్టిపెట్టుకుంటే తమ వేలం పర్సు నుంచి రూ. 18 కోట్లు తగ్గుతాయని తెలిపారు. “వేలంలో రూ. 18 కోట్లు చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బుతో జట్టును మరింత బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. అదే రూ. 12 కోట్లు అయితే మా నిర్ణయం బహుశా మరోలా ఉండేది” అని ఆయన పేర్కొన్నారు.

బాధ్యత పట్ల రసెల్ కూడా సంతోషంగా ఉన్నాడు
ఈ నిర్ణయం గురించి తెలిశాక రసెల్ చాలా భావోద్వేగానికి గురయ్యాడని,కొన్ని రాత్రులు నిద్ర కూడా పట్టలేదని చెప్పాడని మైసూర్ అన్నారు. రిటైర్మెంట్ గురించి రసెల్ ఆలోచిస్తున్న విషయాన్ని జట్టు సహ యజమాని షారుఖ్ ఖాన్‌తో పంచుకున్నప్పుడు, అతడే ఈ సూచన చేసినట్లు వెల్లడించారు.
ఆటగాడిగా కెరీర్ ముగిశాక భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయం సరైందని షారుఖ్ భావించారని తెలిపారు. పవర్ హిట్టింగ్, డెత్ బౌలింగ్, ఫీల్డింగ్‌లో రసెల్ నైపుణ్యాలను గౌరవిస్తూ ‘పవర్ కోచ్’ పాత్రను సృష్టించామని, ఈ కొత్త బాధ్యత పట్ల రసెల్ కూడా సంతోషంగా ఉన్నాడని మైసూర్ (Venky Mysore) వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: