సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో (IND vs SA) టీమ్ ఇండియా 1-1తో సమమైన విషయం తెలిసిందే. విశాఖ వేదికగా ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ గెలవాలంటే టీమ్ ఇండియా ఇవాళ టాస్ గెలవాలి. మొదట బ్యాటింగ్ చేసి ఎంత భారీ స్కోర్ చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో మంచు దెబ్బకు బౌలింగ్ తేలిపోతోంది. ఇటీవల ఉమెన్స్ వరల్డ్ కప్‌లో విశాఖలో జరిగిన 5 ODIల్లో ఛేజింగ్ టీమే గెలిచింది. ఏ విధంగా చూసినా ఇవాళ్టి మ్యాచ్‌లో టాసే కీలకంగా కనిపిస్తోంది.
Read Also: IND vs SA 3rd ODI: రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

మొదటి రెండు మ్యాచ్ లు జరిగిన తీరు
మధ్యాహ్నం 1.30 గంటలకు (IND vs SA) మ్యాచ్ మొదలవుతుంది. వైజాగ్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వారే సీరీస్ విజేత అవుతారు. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్చా లా ఇంపార్టెంట్ గా మారింది. టీమ్ ఇండియాకు ఇది మరీ ముఖ్యమైన మ్యాచ్.
టెస్ట్ లలో ఓడిపోయిన భారత జట్టు వన్డేల్లో అయినా గెలిచితీరాలని పట్టుదలగా ఉంది. పైగా ఇందులో సీనియర్లు కూడా ఆడుతున్నారు. మొదటి రెండు మ్యాచ్ లు జరిగిన తీరు చూశాక మూడో మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగనుందని తెలుస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: