హైటెక్ సిటీకి సమీపంలోని మూసాపేట్ (Moosapet) సర్కిల్, అల్లాపూర్ డివిజన్ ప్రాంతాలు ఇటీవల అక్రమ నిర్మాణాల విస్తరణతో చర్చనీయాంశంగా మారాయి. జీహెచ్‌ఎంసీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే 50 గజాల నుంచి 300 గజాల స్థలాల్లో మల్టీ స్టోరీ భవనాలు నిర్మాణదారులు నిర్మిస్తున్నారు. భూముల ధరలు, అద్దెల ఆదాయం అధికంగా ఉండటం వల్ల అనుమతులు, సెట్‌బ్యాక్, వెంటిలేషన్ వంటి ముఖ్యమైన నిబంధనలు పట్టించుకోకుండానే పనులు చేస్తున్నారు. దీనివల్ల కాలనీల్లో ఇల్లు ఇల్లు అతుక్కున్నట్టుగా కనిపించే పరిస్థితి ఏర్పడింది.
Read also: iBOMMA Ravi: రవికి పోలీసు శాఖలో ఉద్యోగం ? క్లారిటీ ఇచ్చిన డిసిపి

Allapur has become a hotbed for illegal constructions
నివాసితులకు ఇబ్బందులు – అధికారుల నిర్లక్ష్యం
అనియంత్రితంగా సాగుతున్న ఈ నిర్మాణాల కారణంగా గాలి, వెలుతురు సరైన విధంగా దూరక సుదీర్ఘంగా ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అల్లాపూర్ డివిజన్‌లోని పద్మావతి నగర్, వివేకానంద నగర్, లక్ష్మీ నగర్, తులసి నగర్ వంటి కాలనీల్లో ఎక్కువగా సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో నిర్మాణదారులు తమకు అనుకూలంగా నియమాలను ఉల్లంఘిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో అగ్నిమాపక సురక్ష, పారిశుధ్యం, రవాణా సమస్యలు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉన్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: