తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ (TTD) చేసిన ఏర్పాట్లను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భక్తులకు వివరించారు. ఈ సంవత్సరం సాధారణ భక్తులు ఎక్కువగా దర్శనం పొందేలా సమయాన్ని కేటాయించామని తెలిపారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో దాదాపు 164 గంటలు సామాన్య భక్తులకు మాత్రమే ఉండేలా నిర్ణయం తీసుకోవడం ద్వారా టీటీడీ భక్తులపై చూపుతున్న శ్రద్ధను వెల్లడించారు. శ్రీవారీ దర్శనం కోసం తీసుకున్న ఈ నిర్ణయాలు భక్తుల్లో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.
Read also: Scrub typhus: జుళిపిస్తున్న “స్క్రబ్ టైఫస్”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటు
డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు జరిగే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల కోసం సుమారు 7.70 లక్షల మంది భక్తుల రాకను అంచనా వేసి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో తెలిపారు. మొదటి మూడు రోజుల కోసం సర్వదర్శనం టోకెన్లు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించగా, శ్రీవాణి మరియు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేశారు. మిగిలిన రోజులకు శ్రీవాణి టికెట్లు ఉదయం 10 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. జనవరి 2 నుంచి 8 వరకు భక్తులకు VQC–2 ద్వారా సర్వదర్శనం అవకాశం ఉంటుంది. ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేకంగా దర్శనం ఏర్పాటు చేస్తామని, స్థానికులకు జనవరి 6 నుంచి 8 వరకు దర్శన బుకింగ్‌ను డిసెంబర్ 10న అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: