హైదరాబాద్ హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath), గత నెల 27న హాజరు కానందుకు తెలంగాణ హైకోర్టుకు(High Court) ఈరోజు క్షమాపణలు తెలిపారు. వరదలు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలకు అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చిందని, ఆ కారణంగా విచారణకు హాజరు కాలేకపోయానని ఆయన కోర్టులో వివరణ ఇచ్చారు.
Read Also: Emirates Flight: ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు

బతుకమ్మ కుంట కేసు నేపథ్యం
హైదరాబాద్‌లోని బతుకమ్మ కుంటకు సంబంధించిన వివాదాస్పద ప్రైవేటు స్థలంపై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు జూన్ 12న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఎ. సుధాకర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రంగనాథ్ ఈరోజు హాజరయ్యారు.
హైకోర్టు హెచ్చరిక తర్వాత కమిషనర్ హాజరు
అక్టోబర్ 31న కేసు విచారించిన హైకోర్టు, ధిక్కరణ ఎందుకు నమోదు చేయకూడదో నవంబర్ 27న వ్యక్తిగతంగా హాజరై వివరించాలని కమిషనర్‌ను ఆదేశించింది. అయితే బాచుపల్లిలో అత్యవసర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నందున హాజరుకు మినహాయింపు కోరుతూ రంగనాథ్(Ranganath) మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ న్యాయవాది దీనిని కోర్టుకు తెలియజేసినా, హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ — “కోర్టు ఆదేశిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు కమిషనర్‌ను కోర్టులో నిలబెట్టగలం” అని హెచ్చరించింది. హాజరు మినహాయింపు పిటిషన్‌ను కొట్టివేయడంతో, ఈరోజు రంగనాథ్ కోర్టుకు హాజరై క్షమాపణలు చెప్పారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: