నిర్వహణపరమైన లోపాల వల్ల దేశంలోని అతి పెద్ద ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోన్న విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా వందలాది విమానాలను సంస్థ రద్దు చేసింది నేడు కూడా దాదాపు 400కిపైగా విమానాలు రద్దయ్యాయి. ఇండిగోలో నెలకొన్న ఈ సంక్షోభంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే ప్రధాన కారణమని రాహుల్ గాంధీ (Rahul Gandhi)ఆరోపించారు.
Read Also : http://India-Russia: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

ఎప్పటిలాగే జాప్యాలు, రద్దులు, నిస్సహాయతకు మూల్యం చెల్లించేది సాధారణ పౌరులే అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఇలాంటివి మరోసారి జరగకుండా ఉండేందుకు విమానయాన రంగంతో సహా అన్నింటిలోనూ న్యాయమైన పోటీ ఉండాలి. మ్యాచ్‌ఫిక్సింగ్, గుత్తాధిపత్యాలు కాదు’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. మరోవైపు ఈ పరిస్థితిపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
రాహుల్ గాంధీ లోక్ సభ ప్రతిపక్ష నేత?
భారత జాతీయ కాంగ్రెస్ (INC) సభ్యుడైన ఆయన ప్రస్తుతం లోక్‌సభలో 12వ ప్రతిపక్ష నాయకుడిగా మరియు జూన్ 2024 నుండి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలికి లోక్‌సభ సభ్యుడిగా పనిచేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: