ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్(Scrub typhus) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో భయం పెరిగింది. మరణించిన వారు విజయనగరం, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు చెందినవారని అధికారులు తెలిపారు. ఈ వ్యాధికి ఇప్పటివరకు టీకా లేకపోవడంతో, అప్రమత్తత మరియు ముందస్తు జాగ్రత్తలే ప్రధాన రక్షణ మార్గమని వైద్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Horticulture Hub : హార్టికల్చర్ హబ్ కు రూ. 40వేల కోట్లు ఇవ్వబోతున్న కేంద్రం – చంద్రబాబు ప్రకటన
శరీరంపై దద్దుర్లు, కాలిన గాయంలాంటి మచ్చలు, కీటకం కుట్టినట్లైన నొప్పి, అలాగే తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. సొంతంగా మందులు వేసుకోవడం ప్రమాదకరమని చెబుతున్నారు. రోగిని ప్రారంభ దశలో పరీక్షించి, సరైన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తే ప్రాణాపాయం నివారించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ర్యాపిడ్, వైల్-ఫెలిక్స్, ఐజీఎం ఎలిసా పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు.

స్క్రబ్ టైఫస్ ‘ఒరియెంటియా సుట్సుగముషి(Orientia Tsutsugamushi)’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది నల్లిని పోలిన ‘చిగ్గర్ మైట్’ కీటకం కాటు ద్వారా వ్యాపిస్తుంది. అయితే ఇది ఒకరి నుండి మరొకరికి నేరుగా సంక్రమించదు. ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు ఈ కీటకాల పెరుగుదల ఎక్కువగా ఉండటంతో వ్యవసాయ కూలీలు, గడ్డి మైదానాల్లో పనిచేసేవారు, బయట ఆడుకునే పిల్లలకు ప్రమాదం ఎక్కువ.
వ్యాధి నివారణ కోసం చేయాల్సినవి
- ఇంటి చుట్టుపక్కల, పశువుల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి
- గడ్డి, పొదలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను తరచూ శుభ్రం చేయాలి
- రాత్రిళ్లు బయట నేలపై నిద్రించకూడదు
- ఇంట్లో ఎలుకలు, కీటకాలు రాకుండా చర్యలు తీసుకోవాలి
- పాత మంచాలు, ఫర్నిచర్‌ను తరచూ శుభ్రం చేయాలి
- పరుపులు, దుప్పట్లు బాగా దులిపి ఉపయోగించాలి
- పిల్లలు, పెద్దలు శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలి
- పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: