ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా విశాఖ(Visakhapatnam)ను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ ప్రాజెక్టులకు ఆమోదం ఇస్తోంది. ఉద్యోగాల సృష్టి, పెట్టుబడుల పెరుగుదల ద్వారా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also: TTD: పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

నక్కపల్లిలో పాల్స్ గ్లోబల్ టాయ్ పార్క్
తాజాగా విశాఖపట్నం(Visakhapatnam) జిల్లా నక్కపల్లిలో పాల్స్ గ్లోబల్ టాయ్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపమాక, చి.లక్ష్మీపురం గ్రామాల్లో 581.39 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీఓ 223 జారీ చేసింది. భారత్‌ను ఎగుమతి ఆధారిత టాయ్ తయారీ హబ్‌గా నిలబెట్టాలనే కేంద్ర ప్రభుత్వ ప్రణాళికకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు(Project)ను వేగవంతం చేస్తున్నారు.
30,000 మందికి పైగా మహిళలకు ఉపాధి
ఈ టాయ్ పార్క్‌తో ప్రపంచ గ్లోబల్ టాయ్ పరిశ్రమను ఆకర్షించడంతో పాటు, 30,000 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. జపాన్, కొరియా, తైవాన్ పెట్టుబడిదారులతో కలిసి పాల్స్ గ్లోబల్‌తో ప్రభుత్వం భాగస్వామ్యం చేసుకుంది. NH16 రహదారి, విమానాశ్రయం, ఓడరేవు, రైల్వే కనెక్టివిటీతో ఈ పార్క్‌ను ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రాజెక్టుతో విశాఖపట్నం గ్లోబల్ టాయ్ తయారీ మ్యాప్‌లో ప్రత్యేక స్థానం దక్కించుకోనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: