हिन्दी | Epaper

News Telugu: Telugu Language: తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు ఇస్తామనాలి: వెంకయ్యనాయుడు

Rajitha
News Telugu: Telugu Language: తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు ఇస్తామనాలి: వెంకయ్యనాయుడు

విజయవాడ : తెలుగు చదువుకుంటేనే ఏపీ, తెలంగాణాలో ఉద్యోగం ఇవ్వాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah naidu) అన్నారు. మచిలీపట్నం లోని కృష్ణా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న కృష్ణా తరంగ్ 2025′ ఉత్సవాలకు ఆయన హాజరై మాట్లాడారు. ‘ఇటీవల రామోజీరావు జయంతి సందర్భంగా తెలుగు భాషలోనే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు చేయాలని ఈ రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులను కోరాను. దీనికి వారు చేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉంటే…అదే రామోజీరావుకు ఘన నివాళి.

Read also: Pawan kalyan: చిత్తూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

We should give jobs only if we study Telugu

We should give jobs only if we study Telugu

ఇంజనీరింగ్ భోధన మాతృభాషలో జరిగేలా

భారతీయ భాషలను కాపాడాలని ప్రధాని మోడీ ఆలోచన చేస్తున్నారు. ఆంగ్లేయులు వారి భాషను అధికార భాషగా చేసుకొని పాలన చేశారు. మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగును పరిపాలన భాషగా చేయాలి. మెడికల్, ఇంజనీరింగ్ భోధన మాతృభాషలో జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోయినా పేపర్ మీద రాసుకుని మాట్లాడతారు. ఆంగ్లంలో మాట్లాడితేనే గొప్ప అని భావిస్తున్నారు. ముందు మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలి’ అని వెంకయ్యనాయుడు అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870