భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మరోసారి ప్రజలకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపును ప్రకటిస్తూ, రెపో రేటును 5.25% కు తగ్గించినట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజా RBI సమావేశంలో వెల్లడించారు.
ఈ సంవత్సరం RBI వరుసగా నాలుగోసారి రేట్లను తగ్గించడం విశేషం. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్లు(Basis points), జూన్ సమీక్షలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత, తాజాగా మరో 25 బేసిస్ పాయింట్ల కోత వల్ల మొత్తం 2025లో రెపో రేటు 1.25% తగ్గింది. దీనిని నిపుణులు “వడ్డీ రేట్లపై ట్రిపుల్ బోనస్(Triple bonus on interest rates)” గా పేర్కొంటున్నారు.
Read Also: Stock Market: నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

EMIలు తగ్గే అవకాశమా?
రెపో రేటు తగ్గడంతో బ్యాంకులు RBI నుంచి తక్కువ వడ్డీకి నిధులు తీసుకోగలవు. ఈ పరిస్థితిలో, బ్యాంకులు రుణగ్రాహకులకు కూడా తగ్గించిన వడ్డీ రేట్ల ప్రయోజనాలను అందించే అవకాశం ఎక్కువ.
- హోం లోన్లు: గృహ రుణాల EMIలు తగ్గే అవకాశం ఉంది. కొత్తగా రుణం తీసుకునేవారికి కూడా ఇది అనుకూలం.
- కార్ & పర్సనల్ లోన్లు: వాహనం మరియు వ్యక్తిగత రుణాల వడ్డీలు తగ్గితే ఖరీదైన వస్తువుల కొనుగోలుకు వినియోగదారులు ముందుకు రావచ్చు.
- ఆర్థిక వృద్ధి: తక్కువ వడ్డీ రేట్లు వ్యాపారాలను కొత్త పెట్టుబడుల కోసం ప్రోత్సహిస్తాయి. మార్కెట్లో డబ్బు సరఫరా పెరిగి GDP వృద్ధికి తోడ్పడుతుంది.
మొత్తమ్మీద RBI తాజా నిర్ణయం ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుదలకు దోహదపడుతుందని, త్వరలో బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఈ ప్రయోజనాలను ప్రజలకు చేరవేస్తాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: