Adilabad Sabha CM speech : ఆదిలాబాద్‌లో నిర్వహించిన భారీ ప్రజాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా మాట్లాడారు. ప్రజలను పీడించిన గత ప్రభుత్వాన్ని ఓడించి ప్రజాపాలన తీసుకొచ్చామని చెప్పారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉంటాయనీ, ఎన్నికలు ముగిశాక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లు లాగా భావించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
రెండేళ్ల పాలనలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశానని, జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎంగా ప్రజల సేవ చేసే అవకాశం లభించిందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, దేవుడి దయ వల్లనే ముఖ్యమంత్రి అయ్యానన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా రెండేళ్లుగా పాలన కొనసాగుతోందని చెప్పారు.
బీజేపీకి చెందిన ఎమ్మెల్యే పయల్ శంకర్, ఎంపీ గోడం నాగేశ్ ఉన్నప్పటికీ వారిని కలుపుకొని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులను సభల్లో మాట్లాడనివ్వలేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్‌కు వెళ్తే పోలీసులతో అడ్డుకున్నారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని స్పష్టం చేశారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని (Adilabad Sabha CM speech) ప్రధాని, కేంద్ర మంత్రులను ఆహ్వానించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ వల్లే సాధ్యమైందని పేర్కొంటూ, ఆమె ఆశీర్వాదంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు.
Read also: Putin Security: గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసం ప్రధాని మోదీ నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఏడాదిలో ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఎయిర్ బస్ సదుపాయం కూడా తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి అమరవీరులకు గౌరవంగా స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించామని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, (Adilabad Sabha CM speech) కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి ఉదాహరణగా నిలిచిందని విమర్శించారు. ప్రాణహిత ప్రాజెక్టును తిరిగి ప్రారంభించి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. తుమ్మిడి హట్టికి టెండర్లు పిలిచామని తెలిపారు.
ఆదిలాబాద్‌లో విద్య, ఇరిగేషన్, కమ్యూనికేషన్ రంగాల్లో అభివృద్ధి చేస్తామని, యూనివర్సిటీ ఏర్పాటు బాధ్యత తమ ప్రభుత్వదేనన్నారు. ఇంద్రవెల్లి లేదా కొమురం భీం పేరు మీద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉన్నట్లు తెలిపారు.
ఉద్యోగాల విషయంలో గత పదేళ్లలో నియామకాలు (Adilabad Sabha CM speech) జరగలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 61 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు నిర్వహించామని చెప్పారు. త్వరలో మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.
ఆడబిడ్డల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి వేల కోట్ల నిధులు కేటాయించామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సన్నబియ్యం బోనస్, పేదలకు ఆహార భద్రత వంటి కార్యక్రమాలతో ప్రజల జీవన స్థాయి మెరుగుపడిందని చెప్పారు.
గ్రామాల్లో నిధులు తెచ్చే నాయకులను సర్పంచులుగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అభివృద్ధికి నిధులు ఇస్తానని తాను హామీ ఇస్తున్నానని సభలో స్పష్టం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: