తెలంగాణలో (TG Weather) వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చాలా ప్రాంతాల్లో పగటిపూట ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక గురువారం నుంచి 5 రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉంటే తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Read Also: ACB : తెలంగాణలో ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

చలిగాలుల తీవ్రత
శుక్రవారం నుంచి తెలంగాణ (TG Weather)వ్యాప్తంగా రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో చలి ప్రభావం విపరీతంగా పెరిగింది. ఇక ఇవాళ్టి నుంచి గాలిలో తేమ తగ్గడం వల్ల చలిగాలుల తీవ్రత మరింత పెరుగుతుందని.. మరో మూడు రోజుల పాటు రాష్ట్రం గజగజ వణకాల్సిందే అని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: