SBIలో దేశవ్యాప్తంగా (SBI Jobs 2025) 996 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్‌ను కోరుకునే వారికి మంచి అవకాశం. ఎస్‌బీఐ (SBI Jobs 2025) విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో మూడు ముఖ్యమైన విభాగాలలో పోస్టులు ఉన్నాయి. VP వెల్త్, AVP వెల్త్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (CRE) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వార భర్త చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
Read Also: Delhi: నిజాం దర్బారుకు ప్రతీకగా హైదరాబాద్ హౌస్

అర్హతలు
ప్రాంతాల వారీగా ఖాళీల సంఖ్యను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాలలోని అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్‌లో మొత్తం 43 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అమరావతిలో మొత్తం 29 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. VP వెల్త్, AVP వెల్త్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, MBA, CFP/CFA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలు, దరఖాస్తు లింక్ కోసం ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in ను సందర్శించవచ్చు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: