రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనున్నారు. ఉక్రెయిన్ యుద్ధం తరువాత పుతిన్‌కు ఇది తొలి భారత పర్యటన. మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఏళ్లతరబడి కొనసాగుతుండటం ఐరోపా దేశాల్లో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటనను పురస్కరించుకుని ఐరోపా దేశాలు భారత్ సాయం కోసం తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. యుద్ధాన్ని విరమించేందుకు పుతిన్‌కు నచ్చ చెప్పాలంటూ అనేక దేశాల ప్రతినిధులు, దౌత్యవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రధాని మోదీ(Modi)కి పుతిన్ ఫ్రెండే కాబట్టి ఆయన మాట వినే అవకాశం ఎక్కువగా ఉందని ఐరోపా దేశాలు భావిస్తున్నాయి.
Read Also: Crime: ఆ జంట సహజీవన అడుగులు ఆత్మహత్యకు నడిపింది

2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తొలి నాళ్లల్లో ఐరోపా దేశాలు భారత్‌పై అనేక ఒత్తిళ్లు తెచ్చాయి. రష్యా తీరును ఖండించాలని డిమాండ్ చేశాయి. రష్యాతో భారత్ తన బంధాన్ని తెంచుకోవాలని కూడా ఆశించాయి. ఏదో పక్షానికి మద్దతుగా ఉండాలని వివిధ దేశాల ప్రతినిధులు భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, పుతిన్ ఎంతకీ లొంగకపోవడంతో ఐరోపా దేశాలు రూటు మార్చుకున్నాయి. భారత్ జోక్యంతో సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించేందుకు తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అయితే, భారత్ మాత్రం తటస్థ వైఖరినే కొనసాగించింది. యుద్ధాలు చేసే కాలం ముగిసిందని ప్రధాని మోదీ గతంలో పలుమార్లు స్పష్టం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: