AP Infrastructure: అనకాపల్లి జిల్లాలో ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు నాంది పలికింది. నర్సీపట్నం–తాళ్లపాలెం(Narsipatnam–Tallapalem) మధ్య ఉన్న 32 కిలోమీటర్ల రహదారిని నాలుగు లేన్ల జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మార్గాన్ని పరిశీలించిన ఢిల్లీ ప్రైవేట్ కన్సల్టెన్సీ బృందం మరియు ఆర్‌అండ్‌బీ(R&B) అధికారులు త్వరలో డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించనున్నారు.
ప్రస్తుతం కేవలం 7 మీటర్ల వెడల్పు ఉన్న ఈ రోడ్డును 14 మీటర్ల వరకు విస్తరించనున్నారు. అలాగే 21 కొత్త కల్వర్టులు, కొండల అగ్రహారం మరియు తాళ్లపాలెం సంత వద్ద బ్రిడ్జ్ విస్తరణ వంటి పనులు కూడా ప్రాజెక్ట్(Project)లో భాగమయ్యాయి. రహదారి అప్‌గ్రేడ్‌తో రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది.
Read also: AP: అమరావతికి చట్టబద్ధతకు మొదలైన ప్రక్రియ

నర్సీపట్నం హైవే విస్తరణతో వాణిజ్యానికి ఊపు
మాకవరపాలెం, పెదబొడ్డేపల్లి, తాళ్లపాలెం ప్రాంతాలకు ఈ రహదారి విస్తరణ(AP Infrastructure) ప్రత్యేకంగా లభించనుంది. డీపీఆర్ ఆమోదం పొందిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, వాణిజ్య మరియు పారిశ్రామిక కార్యకలాపాలు మరింత వేగం అందుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. మాకవరపాలెం మండలంలో ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీ పనిచేస్తుండగా, జీసీసీ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్(processing unit) కోసం భూములను సేకరిస్తోంది. నర్సీపట్నం పరిధిలో ఎంఎస్‌ఎంఈ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త హైవే ఈ పారిశ్రామిక ప్రాంతాలకు కీలక కనెక్టివిటీని అందించనుంది.
రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం
ప్రస్తుతం రాచపల్లిలో, ఎలమంచిలి–మాకవరపాలెం రోడ్డు పనులు జరుగుతున్నాయి. మొదట రెవెన్యూ శాఖ భూముల్లో పనులు పూర్తిచేసి, తరువాత అటవీ భూముల సేకరణ చేపట్టనున్నారు. రోడ్డు పూర్తయిన తర్వాత, ఎలమంచిలి రైల్వే స్టేషన్(Railway Station)కు చేరుకోవడం మరింత సులభంగా మారుతుంది. అదే సమయంలో, అల్యూమినియం కర్మాగారం నుంచి తాళ్లపాలెం వరకు ఉన్న రహదారిలో మరమ్మతులకు పరిశ్రమ యాజమాన్యం రూ.25 లక్షలు కేటాయించింది. కలెక్టర్ అనుమతి తర్వాత ఈ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ రోడ్డు మరమ్మతులు కూడా స్థానిక ప్రజలకు ప్రయాణ సౌలభ్యాన్ని పెంచనున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: