క్విక్ కామర్స్ సేవలందిస్తున్న బ్లింకిట్(Blinkit App) తమ వినియోగదారుల కోసం మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఆన్‌లైన్ ఆర్డర్ చేసిన తర్వాత ఏదైనా ఐటమ్ మర్చిపోయినట్లయితే, కొత్త ఆర్డర్ వేయాల్సిన అవసరం లేకుండా, అదే ఆర్డర్‌కు అదనంగా వస్తువులను జత చేసే అవకాశం కల్పించింది. ఇలా యాడ్ చేసిన వస్తువులపై అదనపు డెలివరీ చార్జీలు ఉండవు.
Read also: అపార్ట్‌మెంట్ విషయంలో హైకోర్టు కీలక తీర్పు
యూజర్ల కోసం కొత్త సౌకర్యం

ఈ కొత్త సదుపాయాన్ని బ్లింకిట్(Blinkit App) సీఈఓ అల్బీందర్ దిండ్సా ఎక్స్‌లో ప్రకటించారు. చాలా మంది కస్టమర్లు కోరడంతోనే ఈ ఫీచర్‌ను అమలు చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఒక షరతు మాత్రం ఉంది — మొదటి ఆర్డర్ ప్యాకింగ్(Order packing) ప్రాసెస్ ప్రారంభం కాకముందు మాత్రమే అదనపు ఐటమ్స్ జోడించడానికి అవకాశం ఉంటుంది.
ఆర్డర్ తర్వాత కూడా ఐటమ్స్ యాడ్
“ఆర్డర్ ఇచ్చిన తర్వాత అవసరమైతే మరిన్ని ఉత్పత్తులను జోడించుకోవచ్చు. ఆర్డర్ ప్యాక్ అయ్యేలోపు యాడ్ చేస్తే డెలివరీ ఛార్జీలు ఉండవు. ఏదైనా వస్తువు మర్చిపోయినా రెండో ఆర్డర్ వేయాల్సిన అవసరం లేదు” అని దిండ్సా పేర్కొన్నారు. ఈ ఫీచర్‌ను మరింత మెరుగుపరచేందుకు వినియోగదారుల నుంచి సూచనలు కూడా కోరుతున్నారని ఆయన తెలిపారు.
ఇదివరకు ఆగస్టులో బ్లింకిట్ చిన్నారులు కొన్ని ఉత్పత్తులను ఆర్డర్ చేయకుండా ‘పేరెంటల్ కంట్రోల్(Parental control)’ వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా యాడ్-ఆన్ ఫీచర్‌తో వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పిస్తూ, పట్టణ ప్రాంతాల్లో తమ సేవల విస్తృతిని పెంచుకుంటోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: