ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) బస్తర్ డివిజన్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్-దంతేవాడ అంతర్ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు (అమరులయ్యారు). మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
Read Also: Aasim-Imran: ఆసిమ్ మునీర్ కు పిచ్చెక్కింది..ఇమ్రాన్ ఖాన్

పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో మావోయిస్టుల (Maoist) కదలికలపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు కూంబింగ్ (గాలింపు) ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. మరణించిన జవాన్లను హెడ్ కానిస్టేబుల్ మోను వాడారి, కానిస్టేబుల్ దుకారు గొండే, జవాన్ రమేష్ సోడిగా గుర్తించారు. గాయపడిన మరో ఇద్దరు సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
భారీ ఆయుధాలు స్వాధీనం, గాలింపు చర్యల ముమ్మరం
ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్ (SLR), ఇన్సాస్ (INSAS), 303 రైఫిళ్లు వంటి భారీ ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టి, అదనపు బలగాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ ఆపరేషన్‌పై బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ మాట్లాడుతూ, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నందున పూర్తి వివరాలను వెల్లడించలేమని తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: