బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9).. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. ఈ సీజన్ ముగింపుకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. షో చివరికి చేరుకున్న నేపథ్యంలో, మొదటి ఫైనలిస్ట్‌ను ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ వరుసగా కఠినమైన టాస్కులు ఇస్తున్నారు. ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. నువ్వా నేనా అంటూ సాగుతున్న ఈ ఆటలో కళ్యాణ్ పడాల మరో గ్రాండ్ విక్టరీ కొట్టాడు.
Read Also: Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో పెళ్లి అంటూ ప్రచారం.. రష్మిక ఏమందంటే?
గత వారం డెమాన్ పవన్‌ని మట్టికరిపించి హౌస్ (Bigg Boss 9) కి చివరి కెప్టెన్‌గా నిలిచిన కళ్యాణ్.. 13వ వారంలో ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్‌లో దూకుడు చూపిస్తున్నాడు.ఇప్పటికి మూడు టాస్క్‌ల కంప్లీట్ కాగా.. నాలుగో పోరు భరణి, రీతూ చౌదరి, కళ్యాణ్‌ల మధ్య జరిగింది. ఈ రంగులు అద్దే టాస్క్ ప్రతి సీజన్‌లోనూ ఉంటుంది. టీషర్ట్‌లు వేసుకుని రంగులు పులుముకునేవారు.

అయితే ఈ సీజన్‌లో ఆల్రెడీ లాంటి టాస్క్ అయిపోవడంతో.. ఇప్పుడు ఆ రంగు టీషర్ట్‌లపై కాకుండా బోర్డ్‌పై అద్దారు.ఆ తరువాత డైరెక్ట్ ఎటాక్‌కి దిగింది. భరణికి అడ్డుకోవడానికే ప్రయత్నించింది. భరణి రంగు పూయకుండా నిలువరించింది. అయితే ఇక్కడ వీళ్లద్దరూ కొట్టుకుంటుంటే.. అక్కడ కళ్యాణ్ రంగు పూసి పని చక్కబెట్టేశాడు.
ఫినాలే రేస్‌లో కళ్యాణే ముందు
దాంతో ఈ టాస్క్‌లో కళ్యాణ్ గెలిచాడు. సంచాలక్‌గా తనూజ ఉండటంతో కళ్యాణ్ గెలుపు ఖాయమైంది.ఆ తరువాత రేస్‌లో ముందున్న కళ్యాణ్, సుమన్‌లు మళ్లీ పోటీపడ్డారు. ఈ తక్కెడ గేమ్‌లో ఇద్దరూ హోరా హోరీగా పోటీ పడ్డారు కానీ.. సుమన్ శెట్టి తన తక్కెడలో బరువుని వేయకుండా కళ్యాణ్ అడ్డుకోవడంతో ఈ టాస్క్‌లోకూడా కళ్యాణే గెలిచాడు. దీంతో కళ్యాణ్ పడాల టికెట్ టు ఫినాలే రేస్‌లో అందరికంటే ముందున్నాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: